దుబాయ్ లో బాహుబలి జోడీ అదిరే

Update: 2017-04-26 04:52 GMT
బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కు మరో రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న బాహుబలి2కి ప్రచారం విషయంలో.. ఏ మాత్రం లోటు జరక్కుండా అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. దుబాయ్ లో ఈ మూవీ భారీ రిలీజ్ అవుతుండడంతో.. మొత్తం టీం అంతా కలిసి దుబాయ్ లో వాలిపోయి ప్రచారం చేశారు.

ఇప్పటివరకూ పలు ప్రచార కార్యక్రమాల్లో కాసింత లావుగా కనిపించిన అనుష్క.. ఈ సారి స్టైలింగ్ తోనే లుక్ ను కూడా ఛేంజ్ చేసింది. నీలం షేడ్ లో ఉండే ఆకుపచ్చని చీరకట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లుక్స్ లోకి మారిపోయి భలే ఆకట్టుకున్న స్వీటీ.. మళ్లీ మిర్చి రోజులను గుర్తు చేసేసింది. ప్రత్యేకంగా మిర్చి డేస్ అని ఎందుకు అనాలంటే.. ప్రభాస్ లుక్స్ కూడా ఈ టూర్ లో అదిరిపోయాయి. బాహుబలి2 ఎంత అట్రాక్షన్ అవుతోందో.. మూవీలో వీరిద్దరి జంట అంత కీలకం అనే విషయం తెలిసిందే. అందుకే ఈ ఆజానుబాహుడైన అందగాడు కూడా.. తన మ్యాన్లీ లుక్స్ తో చూపరులను ఆకట్టుకుంటున్నాడు.

మరోవైపు యూరోప్ దేశాల్లో కూడా బాహుబలి2 గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా.. ఆ మాటకొస్తే ఏ భారతీయ సినిమా రిలీజ్ కానంత గ్రాండ్ లెవెల్ లో బాహుబలి2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News