ఒకో సినిమాకి ఒక్కో రకం ప్రమోషన్. ఎంత వెరైటీగా పబ్లిసిటీ చేస్తే అంతగా జనాల నోళ్లలో నానచ్చు. కొన్నిసార్లు అంచనాలకు మించిన సక్సెస్ లు కూడా కొట్టచ్చు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈసారి కొత్త కాన్సెప్ట్ ను పట్టుకొచ్చింది సైజ్ జీరో కోసం. ఓ 15రోజులుగా కేరక్టర్లను పరిచయం చేయడం కోసం ఒక్కో ఫోటో రిలీజ్ చేస్తూ.. జనాల్లో మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి. అనుష్క నాజూగ్గా ఎలా ఉందో చూద్దామనే వరకూ కాస్త హైప్ వచ్చింది. ఎప్పుడైతే ఆ ఫోటో కూడా రిలీజ్ చేసేశారో... ఇంక సైజ్ జీరో కోసం సెర్చింగ్ ఆగిపోయింది. ఇంత చేసిన పాత కాన్సెప్ట్ ని కాపీ కొట్టారనే విమర్శలు వినాల్సొచ్చింది. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశాడు ప్రకాష్
హీరోయిన్స్ ఇద్దరి చేతుల్లో రెండు బోర్డులు పెట్టేశాడు. బొద్దు అనుష్క ఏమో ఎవరు ఎలా ఉంటే అలా ప్రేమించడమే ముద్దు అనే స్లోగన్ రాసిన బోర్డ్ పట్టుకుంటే... సన్నగా ఉండడం ముఖ్యం, ఆరోగ్యం కోసం రోజు ఎక్సర్ సైజ్ చేయాలనే అర్ధం వచ్చేలా సోనాలి చౌహాన్ బోర్డ్ లో ఉంది. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. ఎటెంప్ట్ కి రెస్పాన్స్ బాగానే వస్తోంది. ఇలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ ఇంకా ఎన్నున్నాయో ప్రకాష్ దగ్గర. సరే కానీ... మరి ఆర్యన్ చేతిలో పెట్టే బోర్డులో ఏముంటుందో ?