భూత‌కోల వేడుక‌లో అనుష్క ఏం చేస్తోందో చూశారా?

Update: 2022-12-19 13:30 GMT
రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన మూవీ 'కాంతార‌'. 'కేజీఎఫ్ ' మేక‌ర్స్ నిర్మించిన ఈ మూవీ సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు రాని క్రేజ్, ఆద‌ర‌ణ ఈ మూవీకి ద‌క్కింది. రూ.16 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఊహ‌ల‌కంద‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన తీరుకు ట్రేడ్ వ‌ర్గాలు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశాయి.

క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి త‌ప్ప ఇత‌ర భాష‌ల సినీ ప్రియుల‌కు ప‌రిచ‌యం లేని రిష‌బ్ శెట్టి సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో సెల‌బ్రిటీలు సైతం విస్తూ పోయారు. రిష‌బ్ శెట్టిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మూవీలోని చివ‌రి 15 నిమిషాలు హైలైట్ గా నిల‌వ‌డం, రిష‌బ్ శెట్టి భూత కోల నృత్యం చేస్తూ విచిత్రంగా 'ఓ..' అంటూ శ‌బ్దం చేయ‌డంతో దేశ వ్యాప్తంగా భూత కోల నృత్యం వైర‌ల్ గా మారింది. ఈ సినిమా త‌రువాత భూత కోల అంటే ఏంటీ?.. దాని వెన‌కున్న క‌థేంటీ? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది.

దీంతో సంప్ర‌దాయ నృత్యం భూత కోల గురించి గూగుల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇదిలా వుంటే 'బాహుబ‌లి' సిరీస్ సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అనుష్క శెట్టి తాజాగా సంప్ర‌దాయ నృత్యం భూత కోల వేక‌లోపాల్గొన‌డం విశేషం. క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన అనుష్క అక్క‌డి కంటే తెలుగులోనే పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ప్ర‌స్తుతం ఓ యంగ్ హీరోతో సినిమా చేస్తున్న అనుష్క తాజాగా సంప్ర‌దాయ నృత్యం భూత కోల నృత్య వేడుక‌లో పాల్గొన‌డం విశేషం.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంప్ర‌దాయ నృత్యం భూత కోల వేడుక‌లో పాల్గొన్న అనుష్క‌కు సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా ట్రెండ్ అవుతున్నాయి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భూత కోల వేడుక‌లో పాల్గొన్న అనుష్క భూత కోల వేష‌ధార‌ణ‌లో నృత్యం చేస్తున్న వ్య‌క్తిని త‌న కెమెరాలో బంధిస్తూ క‌నిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

https://twitter.com/pranushka_fan/status/1604496534334472194?cxt=HHwWhIDQxZrGqMQsAAAA
Tags:    

Similar News