బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సుల్తాన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం.. విపరీతమైన వసూళ్లు సాధిస్తుండడంతో.. అనుష్క ఆనందానికి పట్టపగ్గాలు ఉండడం లేదు. ఈ మూవీతో మరోసారి 300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం ఖాయమంటున్నారు.
బాలీవుడ్ లో ౩౦౦ కోట్లను తొలిసారిగా పీకే మూవీ చూపించింది. అమీర్ తో అనుష్క శర్మ నటించిన ఆ సినిమా.. ఎన్నెన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఆ తర్వాత.. మళ్లీ ఈ మార్క్ ను భజరంగీ భాయ్ జాన్ అందుకోగలగింది. సల్మాన్ చేసిన ఈ చిత్రం చాలా రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు విడుదలైన ఐదు రోజుల్లోనే సుల్తాన్ 190 కోట్ల వసూళ్లను రాబట్టేసింది. రెండో వారాంతం చివరికల్లా సుల్తాన్ 300 కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అటు సల్మాన్ కు... ఇటు అనుష్కకు 300 కోట్ల మార్క్ ను అందించే రెండో సినిమాగా సుల్తాన్ నిలిచిపోనుంది.
నిజానికి పీకే తర్వాత అనుష్క శర్మ ఫామ్ అంత బాగాలేదు. దిల్ ధడక్ నే దో - బాంబే వెల్వెట్ లాంటి సినిమాలు పేలిపోయాయి. అనుష్క శర్మ స్పీడ్ తగ్గిపోయిందని అంతా అనుకుంటున్న టైంలో.. మళ్లీ ఆల్ టైం హిట్ రేంజ్ సినిమాని అందించడంతో.. ఈమె మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లైంది. సుల్తాన్ 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాక.. ఇలా రెండు ౩౦౦కోట్ల వసూళ్లు ఉన్న ఏకైక హీరోయిన్ గా అనుష్క శర్మ రికార్డు సృష్టిస్తుందన్న మాట.