కొత్త కంపెనీతో ఎంజాయ్ చేస్తున్న అనుష్క

Update: 2016-07-27 16:09 GMT
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకి కొత్త కంపెనీ దొరికేసింది. సినిమాలు - ఈవెంట్లతో తెగ బిజీగా ఉండే అనుష్క ఖాళీ సమయంలో ఏం చేస్తుందో ఇంతకుముందైతే తెలీదు కానీ.. ఇప్పుడు తనే చెప్పేసింది. ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోన్న పోకెమాన్ గో గేమ్ ని ఆడేస్తోంది అనుష్క.

ఇప్పటికే షారూక్ ఖాన్ - వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ అంతా పోకెమాన్ గో ను ఆడేసి ఓ ప్రయోగం చేసేశారు. ఇఫ్పుడా లిస్ట్ లోకి అనుష్క కూడా చేరిపోయింది. వర్చువల్ రియాలిటీ ఆధారంగా రూపొందించిన ఈ గేమ్ కి ఇంటర్నేషనల్ గా క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ గేమ్ ను ఇన్ స్టాల్ చేసేసుకుని ఆడేస్తోంది అనుష్క. అంతే కాదు.. ఆ గేమ్ ఆడుతూ తను ఎంతగా ఎక్సైట్ అవుతోందో.. ఆ విషయాన్ని కూడా ఆన్ లైన్ లో పెట్టేసింది. గతంలో అనుష్క శర్మ తన ప్రియుడు కోహ్లీతో కలిసి చక్కర్లు కొట్టేది. ఎక్కడ మ్యాచులు జరిగితే అక్కడికి వెళ్లిపోయి హంగామా చేసేది. ఇప్పుడా స్పీడ్ లేదు.

పైగా విరాట్ కూడా వెస్టిండీస్ టూర్ లో బిజీగా ఉన్నాడు. మరో నెల్లాళ్లు ఇండియాకొచ్చే ఛాన్స్ లేదు. అందుకే ఈ టైమ్ లో పోకెమాన్ గో గేమ్ తో టైమ్ గడిపేస్తోంది అనుష్క శర్మ. ఆ గేమ్ ఆడుతూ అనుష్క కళ్లలో కనిపిస్తున్న ఆశ్చర్యం చూస్తే.. కొత్త కంపెనీని ఇప్పట్లో వదిలిపెట్టేట్లు కనిపించడం లేదు కదూ.

Tags:    

Similar News