గత రెండ్రోజులుగా స్వీటీ అనుష్క శెట్టి గురించి ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. ఇటీవలే భారీ పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి`లో అదిరిపోయే కామియో రోల్ చేసింది. ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా అదిరిపోయే రోల్ చేసింది. ఉయ్యాలవాడను పరిచయం చేసే ఆ పాత్ర వల్ల సినిమా వెయిట్ పెరిగింది. అది జనాలకు బాగా కనెక్టయ్యింది. అందుకే ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ లోనూ అనుష్క ఓ అతిధి(కామియో) పాత్రలో కనిపించనుందని ప్రచారమవుతోంది. రాజమౌళి బృందం ఆ మేరకు అనుష్కను సంప్రదించిందని గుసగుసలు వినిపించాయి. అయితే ఇది నిజమా? అంటే కానే కాదని తాజాగా రివీలైంది.
అనుష్క పై సాగుతున్న ఈ ప్రచారం అసత్యం. ఇప్పటివరకూ రాజమౌళి మైండ్ లో అలాంటి ఆలోచన ఏదీ లేదు అని ఆర్.ఆర్.ఆర్ టీమ్ సన్నిహితుల నుంచి రివీలైంది. ఇక ఇప్పటికే జక్కన్న మైండ్ కేవలం టార్గెట్ పైనే ఉంది. ఆర్.ఆర్.ఆర్ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. అటుపై ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని తెలుస్తోంది.
అలాగే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపైనా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ 2020లో రిలీజ్ కాదని ప్రచారమైంది. అయితే దీనిని ఖండించనూ లేదు. ఔనని కూడా చిత్రబృందం అనలేదు. ఇప్పటికి ఇంకా రిలీజ్ తేదీ జూలై 30.. ముందే చెప్పిన దానికే రాజమౌళి ఇంకా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఆ డెడ్ లైన్ ప్రకారమే సినిమాని రిలీజ్ చేయాలని షూటింగ్ ని పూర్తి చేస్తున్నారట. రామారావు- రామ్ చరణ్-రాజమౌళి చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేయాల్సి ఉంది. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.