గుణ టీమ్ వర్క్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'రుద్రమదేవి 3డి'. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రమిది. కాకతీయుల చరిత్ర, రుద్రమదేవి వీరత్వం వెండితెరపై ఆవిష్కరిస్తూ అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించారు గుణశేఖర్. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు - తమిళ్ - హిందీ - కన్నడ - మలయాళ భాషల్లో భారీగా థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా రుద్రమదేవి పాత్రధారి అనుష్కతో స్పెషల్ ఇంటర్వ్యూ...
ఇండియాలో తొలి 3డి సినిమాలో నటించారు.. ఎలా అనిపించింది? మీ అనుభవం?
3డి సినిమాలో నటించడం ఇదే మొదటి సారి. గుణశేఖర్ ట్రీట్ మెంట్ - విజయ్ విన్సెంట్ కెమెరా పనితనం సినిమాని నడిపించాయి. రుద్రమదేవి ప్రేక్షకులందరికీ ఓ విజువల్ ట్రీట్. ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఓ 3డి విలేజ్ ని క్రియేట్ చేశారు. అక్కడ తెరకెక్కించిన ఓ సన్నివేశం అద్భుతం. అది తెరపై చూస్తే ఊపిరి తీసుకోనంత ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. స్వతహాగా నేను ఏదైనా సన్నివేశంలో నటించినప్పుడు ఎప్పుడూ మోనిటర్ చూడను. దర్శకుడు షాట్ కి పిలిస్తే వెళ్లి నా పని నేను చేసేస్తానంతే. నటించేప్పుడు ఇది 2డి - 3డి అనే తేడా అనే తేడా కనిపించలేదు.
గుణశేఖర్ గురించి?
100 మంది ఆర్టిస్టులు ఉన్నా ఆయన కనుసన్నల్లోనే పనిచేయాలి. ప్రతి ఫ్రేమ్ ఎలా కదులుతుందే గమనిస్తారు. కుడి, ఎడమ అనే జర్క్ కూడా ఉండదు. రుద్రమదేవి అనే కాదు ఏ సినిమాకి ఆయినా ఆయన అంతే ఓపిగ్గా, ప్యాషనేట్ గా పనిచేస్తారు. ఫ్రేమ్ సెట్ చేయడం నుంచి ఎమోషన్ సహా ప్రతిదీ పక్కాగా వచ్చే వరకూ ఎంతో కేర్ తీసుకుని పనిచేస్తారు. ఫ్రేమ్ వేరియేషన్స్ అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. అసలే 3డి సినిమా కాబట్టి చాలా కేర్ తీసుకుని మరీ పనిచేశారు. ఇలాంటి సినిమాకి పనిచేసేప్పుడు ప్రతి స్మాల్ డీటెయిల్ లైఫ్ నిచ్చేవిగా ఉంటాయి. అందుకే వాటి గురించి ఎంతో కేర్ తీసుకునేవారు.
మీ పాత్ర గురించి?
కథానాయిక పాత్ర అంటే .. చెట్లు, పుట్టలు పట్టుకుని పాటలు, డ్యాన్సులు ఇవే కాదు. స్విట్జర్లాండ్ వెళ్లి పాటల్లో ఆడిపాడడమే కాదు.. ఈ సినిమా విషయంలో ఇవన్నీ మిస్సయిపోయా. కానీ రుద్రమదేవి రోల్ నటించేందుకు చాలా స్కోప్ ఇచ్చింది. పెర్ఫామెన్సె పరంగా నేర్చుకునేందుకు ఆస్కారం దక్కింది. కెరీర్ ఆరంభం నుంచి నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నా. అవకాశాలొచ్చేది నేర్చుకునే తత్వం వల్లే.
రానాతో కలిసి నటించిన అనుభవం?
రానాతో పనిచేయడం అంటే ఫ్యామిలీలో కలిసి పనిచేసినట్టే. రానాని నేను బ్రదర్ అని పిలుస్తా. తను కూడా నన్ను బ్రదర్ (నవ్వేస్తూ) అనే పిలుస్తాడు. తనతో పోటీగా ఉంటుంది. హైటు - వెయిటు అన్నీ ఇంచుమించు ఒకేలా కనిపిస్తాం కాబట్టి. ఈ సందర్భంలో బన్ని గురించి మాట్లాడాలి. బన్ని మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తాడు. సేమ్ క్వాలిటీస్ రానాలో చూశా. రానా నేను బాహుబలి కోసం కలిసి పనిచేశాం. ఏడాది పైగానే సినిమా కోసం ట్రావెల్ చేశాం.
అందువల్ల రుద్రమదేవిలో నటిస్తున్నప్పుడు చాలా సౌకర్యం అనిపించింది.
గోనగన్నారెడ్డి పాత్ర గురించి?
గోన గన్నారెడ్డి ..ఎక్స్ క్లూజివ్. చరిత్ర గురించి చాలామందికి తెలుసినా ఈ క్యారెక్టర్ గురించి తెలిసినది తక్కువే. ఓ మంచి ప్రాజెక్టుకి బన్ని పూర్తి సపోర్ట్ గా ఉంటాడు. తను ఎప్పుడూ ఓ మంచి ప్రాజెక్టు చేద్దామనే ఉత్సాహంతో ఉంటాడు. ఈ సినిమాలో ఇలాంటి కీలకపాతల్రో నటించినందుకు తనకి థాంక్స్. ఈ సినిమాలోకి బన్ని ఎంట్రీ సర్ ప్రైజ్ లాంటిదే. షూటింగ్ టైమ్ లో అతడి పనితీరు, కో ఆపరేషన్ ఔట్ స్టాండింగ్.
ఇళయరాజా మ్యూజిక్ గురించి?
ఇళయరాజా గారి పనితనం సినిమాకి పెద్ద అస్సెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకి పెద్ద అస్సెట్ అయ్యాయి. ఓ ఎమోషనల్ మూవీకి ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇవ్వడం వల్ల 50 నుంచి 60 శాతం పెద్ద స్థాయికి వెళ్లింది.
కాస్ట్యూమ్ డిజైనర్ గురించి?
నీతా లుల్లా.. ప్రాజెక్టులోకి రాకముందే .. నా టెస్ట్ షూట్ చేశారు. ఆ తర్వాత తనతో చర్చించారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ... నా క్యారెక్టర్ కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. 3డి విజువల్ కి తగ్గట్టే మేకప్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో ఉపయోగించిన ప్రతి మెటీరియల్ స్వేచ్ఛగా తనకి కావాల్సినదే ఎంచుకున్నారు. జువెలరీ - శారీస్ అన్నీ తనే స్వేచ్ఛ తీసుకుని డిజైన్ చేశారు. నీతా - భాను ( మేకప్ - హెయిర్ డిజైన్) కలిసి పనిచేశారు. నీతాలుల్లా మొదటిసారి నన్ను చూసినప్పుడు కళ్లు మూసుకుని రుద్రమ రూపం ఊహించుకున్నారు. నన్ను ఎలా చూపించాలి? బాడీ షేప్ ఎలా డిజైన్ చేయాలి..? అన్నీ ఆలోచించడం నేను గమనించాను. చరిత్రను వక్రీకరించకుండా .. అవసరం అయిన స్వేచ్ఛ తీసుకుని ప్రతిదీ కాస్ట్యూమ్స్ లో ఆవిష్కరించడంలో నీతా పనితనాన్ని మెచ్చుకోవాలి.
కళాదర్శకుని గురించి?
కళాదర్శకుడు తోట తరణి విజ్ఞానం అసాధారణమైనది. అతడి ప్యాషన్ యూనిక్. కామన్ జనాలతో పోలిస్తే ఆయన ఆలోచనలు డిఫరెంట్. ఇంటెలిజెన్స్ వేరే. ప్రతిదీ ఎంతో ఆసక్తిగా, ప్యాషన్ తో శ్రద్ధతో చేశారు. గుణశేఖర్ - తరణి కలిసి అద్భుతమైన సెట్స్ డిజైన్ చేశారు.
ఛాయాగ్రాహకుని గురించి?
అజయ్ విన్సెంట్ .. మొదటి రోజు షూటింగ్ చేసినప్పుడు .. ఆన్ సెట్స్ ఎలా ఉంటారో గమనించా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ - కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇలాంటి సినిమాలకు చాలా ఒత్తిడి ఉంటుందని అర్థమైంది. 3డికి కెమెరా సెటప్ పూర్తిగా వేరు. ఆయన చాలా క్వాలిటీ వర్కర్. తెరపై ఎందరు నటీనటులు కనిపించినా, తెరవెనక ఉండి నడిపించేది ఆయనే. ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీకరణ పూర్తి చేయడంలో అతడో ఇంటెలిజెంట్.
ఫైనల్ గా రుద్రమపై మీ కన్ క్లూజన్?
ప్యాషన్ తో చేసిన ప్రయత్నమిది. హిస్టరీని చూపించాలని చేసిన ఎటెంప్ట్ ఇది. గుణశేఖర్ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసినా సంథింగ్ ఇంకేదో టచ్ చేయాలని ఈ ప్రయత్నం చేశారు. తనే స్వయంగా నిర్మాతగా .. దర్శకుడిగా కొనసాగారు. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా ఓరిమితో పనిచేసే దర్శకుడాయన. యుద్ధాన్ని గెలిచే యోధుడు. రుద్రమదేవి సినిమాని జనాలు చూసి గుణశేఖర్‌ని పొగిడితే సంతోషం, సంతృప్తి చూడాలని ఉంది. గుణశేఖర్ అద్భుతమైన సినిమా తీశారు. ప్రేక్షకులంతా థియేటర్లకు రండి. సినిమా చూడండి, ఆస్వాదించండి.