నిశ్శబ్దం అని ఒక కొత్త సినిమా. అనుష్క కథానాయికగా నటించింది. మాధవన్ ఓ కీలక పాత్ర చేశాడు. హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ కూడా ఇందులో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో మంచు విష్ణుతో 'వస్తాడు నా రాజు' అనే ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఔట్ డేట్ అయిపోయిన రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తూ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదలు కావడానికి ముందు నుంచి కోన అండ్ టీం మామూలుగా హడావుడి చేయట్లేదు. ముందే అనుష్క లీన్ లుక్ ఒకటి రిలీజ్ చేయడం.. మాధవన్‌తో పాటు మాడిసన్ ఈ సినిమాలో భాగం కావడం గురించి ఓ రేంజిలో ప్రచారం చేశారు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ లుక్ ఒకటి.. ఫస్ట్ లుక్ ఒకటి లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వీటి గురించి చిత్ర బృందం మామూలుగా డబ్బా కొట్టుకోవట్లేదు.
ఇప్పుడు మాధవన్ ఫస్ట్ లుక్ గురించి హడావుడి చేస్తున్నారు. ఇందులో అతను మ్యుజీషియన్ పాత్ర చేస్తున్నాడు. అనుష్క ఇందులో మాట్లాడలేని, వినబడని మ్యూట్ ఆర్టిస్టు పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రల వ్యవహారం చూస్తే మన జనాలకు ఇదేమాత్రం రుచిస్తుందో అనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని మొదట్నుంచి ఊదరగొడుతున్నారు కానీ.. ఇప్పటిదాకా మన ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించడంలో విజయవంతం కాలేేదు చిత్ర బృందం. అనుష్క, మాధవన్ జోడీ కడితేనేమి.. హాలీవుడ్ నటుడు చేస్తేనేమి.. ముందు ఈ సినిమా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉంటుందా లేదా అన్నది ప్రధానం. ఇప్పటికైతే సినిమాకు మన దగ్గర బజ్ క్రియేట్ కాలేదు. దీని టీజర్ చూశాక వచ్చాక ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.