తెరపై గ్లామర్ కుమ్మరించే హీరోయిన్ల మీద కొందరికి ఒకలాంటి భావన ఉంటుంది. వారు పబ్లిక్ ప్రాపర్టీగా ఫీలయ్యే వారికి కొదవ ఉండదు. అయితే.. రీల్ లైఫ్ వేరే.. రియల్ లైఫ్ వేరన్న విషయాన్ని మర్చిపోతుంటారు చాలామంది. ఇదే.. చాలామంది హీరోయిన్లకు కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెడుతుంది.
పబ్లిక్ ఫంక్షన్లకు అటెండ్ అయ్యే హీరోయిన్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. అసభ్యంగా టచ్ చేసే వారిని చంపేయాలన్నంత కోపం వస్తుందని చెప్పింది అనుష్క. ఇటీవల తనకు ఎదురైన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. పబ్లిక్ ఫంక్షన్ కు వెళితే.. ఒకరు తనను అసభ్యంగా తాకాలని ప్రయత్నించారని.. ఆ టైంలో అతడ్ని చంపేయాలన్నంత కోపం వచ్చిందని చెప్పింది. కానీ.. అలా చేయలేమంటూ.. అందుకే అతడ్ని తాను కొట్టానని.. ఆ రోజు రాత్రి తనకు నిద్ర పట్టలేదంది. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారని చెప్పిన అనుష్క.. క్యాస్టింగ్ కౌచ్ మీద కూడా స్పందించింది.
తనకిప్పటివరకూ అలాంటి సంఘటనలు ఎదురు కాలేదని.. తాను ఎవరితో పని చేసినా అందరూ తనతో చాలా బాగా బిహేవ్ చేసినట్లుగా చెప్పింది. తమకు ఎదురైన అసభ్యకర పరిస్థితుల గురించి సెలబ్రిటీలు ఓపెన్ గా మాట్లాడటం మంచి పరిణామంగా చెప్పింది.దేశంలో 60 శాతం మంది కుటుంబ సభ్యుల ద్వారానే వేధింపులకు గురి అవుతున్నారంటూ రిపోర్ట్ లు వస్తున్నాయని చెప్పింది. వేధింపుల గురించి బయటకు చెప్పేందుకు చాలామంది భయపడుతుంటారని.. అలాంటి పరిస్థితి ఎదురైతే ధైర్యంగా చెప్పేలా పేరెంట్స్ కు నేర్పించాలన్నారు. అప్పుడే వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి చెబుతారని చెప్పింది అనుష్క.