అనుష్క అని తెలుగులో ఓ స్టార్ హీరోయిన్ ఉండేది గుర్తుందా...? అదేనండీ అరుంధతి - బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిందే ఆ అమ్మాయేనండోయ్. ఏంటీ వెటకారం అనుకుంటున్నారా..? మరి సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఓ స్టార్ హీరోయిన్ మూడు నెలలుగా ఎక్కడా కనిపించకపోతే ఎలా ఉంటంది చెప్పండి? అప్పుడెప్పుడో ‘సైజ్ జీరో’ విడుదలకు ముందు ప్రమోషన్లలో కనిపించడమే ఆఖరు. ఆ తర్వాత అనుష్క ఎక్కడా దర్శనమిచ్చింది లేదు. ‘బాహుబలి-2’ కోసం తాను చాలా బరువు తగ్గాల్సి ఉందంటూ చివరగా ఇంటర్వ్యూలో చెప్పిన అమ్మాయి.. ఆ తర్వాత ఉన్నట్లుండి అదృశ్యమైంది.
బహుశా ‘సైజ్ జీరో’ కోసం పెంచిన అదనపు క్యాలరీల్ని కరిగించే పనిలో ఉందేమో జేజెమ్మ. ఐతే తాను తగ్గాల్సింది ఇంకో పది కిలోలే అని చెప్పింది అనుష్క అప్పట్లో. కష్టపడితే ఓ రెండు నెలల్లో పూర్వపు స్థితికి వచ్చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి అనుష్క ఏం చేస్తోందో ఏంటో? తన అభిమానులు మాత్రం మూడు నెలలకు పైగా ఆమె కనిపించకపోయేసరికి బెంగ పెట్టేసుకుంటున్నారు. ఓ స్టార్ హీరోయిన్ ఇన్ని రోజులు ఎక్కడా బయట కనిపించకపోవడం అరుదైన విషయం. బహుశా తన మునుపటి రూపాన్ని నేరుగా సినిమాలోనే చూపించాలని భావిస్తోందేమో అనుష్క. ఆల్రెడీ ‘బాహుబలి-2’ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ సహా ప్రధాన పాత్రధారుల మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. అనుష్క నేరుగా అక్కడికి వెళ్లిపోయి ఈ షూటింగుకే అంకితమైపోతుందేమో. కాబట్టి ఇంకొన్ని నెలలు జేజెమ్మ బయట కనిపించడం అనుమానమే.