'మీటూ', 'కాస్టింగ్ కౌచ్'లపై స్పందించిన అనుష్క

Update: 2020-03-21 06:35 GMT
'మీటూ' మరియు 'కాస్టింగ్ కౌచ్' ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను కుదిపేసిన ఉద్యమాలు. సినీ ఇండస్ట్రీలో వేధింపులు సర్వసాధారణమంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. కొందరైతే ఆ దర్శక నిర్మాతల పేర్లను డైరెక్టుగా బయట పట్టేశారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఈ సమస్య ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ రంగంలోనూ ఉన్నదే. మన టాలీవుడ్ లోనూ ఈ విషయంపై నటీమణులు చాలా సందర్భాలలో స్పందించారు. ఇదిలా ఉండగా తాజాగా స్టార్ హీరోయిన్ కూడా ఈ విషయం పై స్పందించారు. ఈ మధ్య తాను నటించిన చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక స్పెషల్ కార్యక్రమానికి హాజరైన అనుష్కా శెట్టి దీనిపై తన అభిప్రాయాలను తెలియజేసారు.  

ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ ఉనికి గురించి అనుష్క మాట్లాడుతూ 'మీటూ' మరియు 'కాస్టింగ్ కౌచ్'లు కేవలం ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదని, ప్రతీ రంగంలో ఉన్న ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మన టాలీవుడ్ లో ఇది లేదని చెప్పడం లేదని, నావరకైతే ఈ సమస్య ఎప్పుడు ఎదురుకాలేదని తెలిపింది. ఎందుకంటే నేను ముక్కుసూటిగా, నిజాయతీగా ఉంటాను కాబట్టి అవి నాదాకా రాలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఒక మహిళ నుండి వేరే రకమైన బెనిఫిట్స్ ఆశించడం తప్పని, అలాంటివి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. మహిళలు ఏ రంగంలోనైనా నిలబడి కీర్తి పొందాలంటే సులభ మార్గం కఠినమైన మార్గం రెండూ ఉంటాయని, నేను కఠిన మార్గాన్నే ఎంచుకున్నానని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి 'నో' అని చెప్పడం నేర్చుకుంటేనే పురుషులు స్త్రీలను గౌరవించడం ప్రారంభిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

అనుష్క ప్రస్తుతం మాధవన్ తో కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అనుష్క బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. 'నిశ్శబ్దం' మూవీ అనుష్కా శెట్టికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.
Tags:    

Similar News