చాలా రోజుల నుండి అసలు హీరోయిన్ అనుష్క శర్మ.. ఆమె క్రికెటర్ ప్రియుడు విరాట్ కొహ్లీ.. జంటగా ఉన్నారా లేకపోతే విడిపోయారా అనేది పెద్ద చర్చనీయాంశమే. అయితే వేలంటైన్స్ డే నాడు విడిపోయినా.. ఓ నెలలోనే ఇద్దరూ కలసిపోయారు కూడా. తరువాత విరాట్ పెర్ఫామెన్స్ గురించి కొందరు అతిగాళ్ళు అనుష్కను కామెంట్ చేస్తే.. మనోడు వాళ్ళకి సోషల్ మీడియాలో కోటింగ్ ఇచ్చాడు కూడా.
కట్ చేస్తే.. వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టించేశారు ఓ జపనీస్ రెస్టారెంట్ వారు. బెంగుళూరులోని ఐటిసి గార్డెనియా హోటల్ లాబీలో.. ఒక జపనీస్ రెస్టారెంట్ ఉంది. మొన్న మే 14న గుజరాత్ లయన్స్ టీమ్ పై ఐపిఎల్ మ్యాచ్ గెలిచాక.. బెంగుళూరు ఆర్.సి.బి కెప్టెన్ కొహ్లీ అక్కడే పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీకి అనుష్క శర్మ కూడా వచ్చింది. ఇక పార్టీ లోపల ఎవ్వరూ ఫోటోలు తీయలేదు కాని.. ఆ జపనీస్ రెస్టారెంటులోని చెఫ్ లు మాత్రం.. మాతో ఒక ఫోటో దిగండి ప్లీజ్ అని అడగ్గానే.. మన జంట కాదనలేకపోయింది. అలా మనకు దొరికిపోయింది.
పోనివ్ లేండీ.. బాలీవుడ్ లో జరుగుతున్న బ్రేకప్ లు చూస్తుంటూ ఇప్పుడు ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. ఖచ్చితంగా ఈ పోటో మాత్రం మన మనస్సుల్లో ఆనందం నింపుతుంది. గుడ్ లక్ అనుష్క.. విరాట్!!