లిస్బెన్ వీధుల్లో అనుష్క చిందులు!

Update: 2016-10-03 16:10 GMT
అలవాటులో పొరపాటో లేక ఆ సంగీతానికి కాలు కదపకపోతే అసలు డ్యాన్సరే కాదనుకుందో ఏమో కానీ వీధుల్లోని తీర్మార్ మ్యూజిక్ కి కాలు కదిపేసింది అనుష్క శర్మ. సరైన చాన్స్ దొరికితే వీదైతేమిటి, వెండితెరైతే ఏమిటి అనే రేంజ్ లో ఈ అమ్మడి వీది డ్యాన్స్ ప్రస్తుతం ఆన్ లై న్లో హల్ చల్ చేస్తొంది. డప్పుమీద దెబ్బడితే లేదు అన్నట్లుగా చెలరేగిపోయిన ఈ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒక కూల్ డ్యాన్సర్ తో కలిసి లిస్బెన్ వీధుల్లో లైవ్ మ్యూజిక్ కి తనదైన స్టైల్లో చిందులు వేసింది.

"రబ్‌ నే బనాదీ జోడీ" సినిమాతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ తో జతకట్టి, ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ మరోసారి కింగ్‌ ఖాన్‌తో కలిసి "ద రింగ్" అనే సినిమాలో నటిస్తోంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం యూరప్ లో జరుగుతుంది. ఈ క్రమంలో షారుఖ్‌, అనుష్క లు ప్రస్తుతం యూరప్‌ లో షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే ఆ షూటింగ్‌ లో ఎంత బిజీ బిజీగా ఉన్నా కాస్త తీరిక దొరికితే హ్యాపీగా గడపడం అలవాటున్న్  అనుష్క పోర్చుగల్‌ లోని లిస్బెన్‌ వీధుల్లో లైవ్‌ మ్యూజిక్‌ కు చిందులు వేసింది. అక్కడి లైవ్ మ్యూజిక్ వేడుకలో కూల్‌ డ్యాన్సర్‌ తో కలిసి ఉత్సాహంగా ఉరకలేసిన అనుష్క శర్మ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియోని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ చేసింది.

కాగా, సినిమాల్లో ఎంత పరిచయమో, టీం ఇండియా టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలిగా అనుష్క అంతకంటే ఎక్కువే ఫేమస్. గ్రౌండ్ లో తన గర్ల్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టి బ్యాట్ తో ఫ్లయ్యింగ్ కిస్సులు ఇచ్చిన విరాట్ ని, ఆ కిస్సులకు తనదైన శైలిలో కళ్లతోనే స్పందించే అనుష్క చూపులను ఎలా మరిచిపోగలరు ఎవరైనా?
Full View

Tags:    

Similar News