ప్రియుడి ముందే హీరోతో లిప్‌లాక్‌లు

Update: 2015-04-07 09:30 GMT
హీరోయిన్‌ అంటే తెగింపు అని అర్థం! ఫ్యామిలీ ముందు, ప్రేమికుడి ముందు, చివరికి కట్టుకోబోయేవాడి ముందు, భర్త ముందు.. పెదవి ముద్దులు ఇవ్వాల్సిందే. హీరోతో అదరచుంబనాల్లో పాల్గొనాల్సిందే. లేదంటే వృత్తికి అన్యాయం చేసినట్టు. నటన పట్ల నిబద్ధత, వృత్తి పట్ల గౌరవం లేనట్టు లెక్క. ఏ నటికైనా ఆ కమిట్‌మెంట్‌  తప్పనిసరి.

వృత్తిగతమైన ఎలాంటి సమస్యని ఇంటివరకూ తేకూడదు. అయితే అటువైపు కుటుంబ సభ్యుల నుంచి కానీ, ప్రియుడి నుంచి కానీ, కాబోయే వాడి నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. ఒత్తిడులు పనిచేయకూడదు. అప్పుడే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే సరిగ్గా ఇదే పాయింటును ఉపయోగించుకుని ఓ అందాల హీరోయిన్‌ ప్రియుడి ముందే, కుటుంబ సభ్యుల ముందే ఏకంగా ఏడు పెదవి ముద్దులకు సిద్ధమవుతోంది. పైగా ఇప్పటికే ఇద్దరు భామలతో సరసాలాడి అందులో ఒకరికి హ్యాండిచ్చి, ఇంకొకరితో కులుకుతున్న సదరు హీరోతో ఇలా సయ్యాటకు సిద్ధమైందంటే ఆ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అసలింతకీ ఎవరీ ఇద్దరూ?

అవును.. ఆ ఇద్దరూ అనుష్క శర్మ, రణబీర్‌ కపూర్‌. ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం ఏడుసార్లు పెదవి పెదవి పెనవేస్తున్నారు. ఈ సన్నివేశాలన్నీ అనుష్క శర్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెరపై చూసి ఆస్వాధించాల్సిందే. వాళ్లంతా సరే తనని ఎంతో ఘాడంగా ప్రేమిస్తున్న విరాట్‌ కోహ్లీ పరిస్థితి ఏమిటి? అనుష్కకి ప్రియుడి అనుమతి లభించిందా? అన్న చర్చలు బాలీవుడ్‌లో సీరియస్‌గా సాగుతున్నాయి. అదీ సంగతి.

Tags:    

Similar News