మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్.. నాగవంశీ సడన్ ట్విస్ట్
అయితే ఇప్పటి వరకూ మార్చి 29న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ చిత్రం తాజాగా ఒక రోజు ముందుకు చేరుకుంది.
ఈ ఏడాది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు మరోసారి సిద్ధమవుతోంది మ్యాడ్ గ్యాంగ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. అయితే ఇప్పటి వరకూ మార్చి 29న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ చిత్రం తాజాగా ఒక రోజు ముందుకు చేరుకుంది. నిర్మాత ఎస్. నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
నాగవంశీ ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. "మా డిస్ట్రిబ్యూటర్ల సూచనతో, అలాగే వారి మద్దతుతో మ్యాడ్ స్క్వేర్ విడుదలను ఒక రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మార్చి 28న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది" అని తెలిపారు. మార్చి 29న అమావాస్య కావడంతో, డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు విడుదల తేదీని మార్చినట్లు ఆయన వివరించారు.
అదే రోజు నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రోబిన్‌హుడ్’ కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం విశేషం. అయితే నాగవంశీ దీనిపై కూడా స్పందిస్తూ, "మార్చి 28 తెలుగు సినిమాకు ఒక గొప్ప రోజుగా మారనుంది. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు బిగ్ స్క్రీన్‌పై అలరించబోతున్నాయి" అంటూ స్పందించారు.
‘మ్యాడ్’ సినిమా బిగ్ హిట్ కావడంతో, ఆ సినిమాకు రెండో భాగంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ‘లడ్డు గాని పెళ్లి’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో విడుదల తేదీ మారడం, ప్రమోషన్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
నాగవంశీ తన ట్వీట్‌లో నితిన్, వెంకీ కుడుములకు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ, "ఈ సమ్మర్ నవ్వుల పండుగ" అంటూ సినిమా మీద కాన్ఫిడెన్స్‌ను చూపించారు. అయితే ‘మ్యాడ్ స్క్వేర్’కు ‘రాబిన్‌హుడ్’ పోటీగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, రెండు సినిమాలకూ వేరే టార్గెట్ ఆడియెన్స్ ఉండటంతో పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నారు. మొత్తానికి, ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో ఇంకోరోజు ముందే నవ్వుల విందు అందించబోతోంది. ఈ మార్చి 28 ప్రేక్షకులకు నిజంగానే ఓ ఫుల్ కామెడీ ట్రీట్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య అసలైన ఫైట్ ఏలా ఉంటుందో చూడాలి.