ఒక సినిమా కెరీర్ ని కాకపోయినా.. కష్టాల్లోకి నెట్టేయడం అంటే ఏంటో స్వీటీ అనుష్కను చూస్తే అర్ధమైపోతుంది. పాత్రకు అనుగుణంగా సినిమాకి తగినట్లుగా వేరియేషన్ చూపించడం కోసం బాగా రిస్క్ చేసేసింది. సైజ్ జీరోలో లావుగా కనిపించేందుకు తెగ లావయిపోయిన అనుష్క.. ఇప్పుడా సైజులు తగ్గించుకోవడానికి చాలానే ఇబ్బందులు పడుతోంది.
ప్రస్తుతం భాగమతితో పాటు బాహుబలి2 లో అనుష్క నటించాల్సి ఉండగా.. ఈమె సైజ్ ల కారణంగా షూటింగ్ కి ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా బాహుబలి ది కంక్లూజన్ లో అయితే.. మహారాణి దేవసేనగా మెరిసిపోవాల్సి ఉంది. ఆ పాత్రను ఈ సైజులతో చేయడం చాలా కష్టం. అందుకే సహజ సిద్ధంగానే తన బరువు తగ్గించుకునేందుకు తెగ కష్టపడిపోతున్న స్వీటీ.. ఇప్పుడు సైక్లింగ్ రూట్ ఎంచుకుంది. ముఖానికి మాస్క్ వేసుకుని.. సీక్రెట్ గా హైదరాబాద్ లో రోజూ 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కేస్తోందట అనుష్క.
జిమ్ లు.. ట్రెడ్ మిల్స్ లాంటివన్నీ అయిపోవడంతో.. ఇప్పుడు ఆన్ రోడ్ పై చెమటోడ్చేస్తోంది అనుష్క. మరి వీటి రిజల్ట్ ఎలా ఉందో తెలియాలంటే.. మళ్లీ అనుష్కను ఏదో ఒక ఫంక్షన్ లో చూడాల్సిందే. కానీ అనుష్క పడుతున్న ఇబ్బందులు తెలిశాక.. ఒక్క సినిమా కోసం కోరి కష్టాలు కొని తెచ్చుకుందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగానే వినిపిస్తున్నాయి.