హైద్రాబాద్ లో మోస్ట్ డిజైరబుల్ విమన్ ఎవరు? ఇదే క్వశ్చన్ జనాలని అడిగితే.. వాళ్లంతా స్వీటీ అనుష్కకే ఓటు గుద్దేశారు. ఎంతోమంది కొత్త భామలు వచ్చినా, తన సినిమాల సంఖ్యను తగ్గించుకున్నా.. ఇప్పటికీ అనుష్కనే నెంబర్ వన్ గా ఎంపిక చేశారు జనాలు. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో.. అనుష్క టాప్ ప్లేస్ లో నిలవడం.. చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఫిలిం ఇండస్ట్రీలో ఏదన్నా టఫ్ రోల్ తగిలితే.. మొదటగా అనుష్కనే పరిశీలిస్తారు. సినిమాలపై అమ్మడికి ఉన్న ఈ కమాండ్.. స్వీటీని టాప్ ప్లేస్ లో నిలబెడుతోంది. నిజానికి అమ్మడి క్రేజ్ బాగా తగ్గిందనే వాదన ఉన్నా.. బాహుబలిలో దేవసేన పాత్రతో అనుష్క రేంజ్ మళ్లీ ఆకాశానికి చేరిపోయిందని చెప్పాలి. స్క్రీన్ పై కనిపించనది కాసేపే అయినా.. తన మార్క్ నటనతో ఆకట్టుకుంది అనుష్క.
అయితే 30ల్లోనూ మోస్ట్ డిజైరబుల్ అనిపించుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. కానీ అనుష్క మాత్రం ఇలాంటి నెంబర్ గేమ్ ని అసలు పట్టించుకోనని అంటోంది. 'ఏజ్ కంటే నేను ఉన్న ఇండస్ట్రీకి ఫేస్ చాలా ముఖ్యం. దీన్ని కాపాడుకోవడాన్ని నేను బాగా ఇష్టపడతాను. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడమే నా సీక్రెట్' అంటున్న అనుష్క.. తనకు నచ్చేలా ఉండడమంటే.. నిజాయితీతో నిండిన కళ్లు ఉండాలని అంటోంది. కళ్లజోళ్లు పెట్టుకునేవారిని అసలు పట్టించుకోదట. కళ్లతోనే నవ్వేవాళ్లను బాగా ఇష్టపడతానని చెబుతోంది స్వీటీ.