అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా మంచి అవకాశాలు దక్కించుకుంది. ఇటీవల వచ్చిన భాగమతి కూడా కాసులు కురిపించింది. దీంతో అనుష్కతో సినిమాలు తీయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అమెరికాలో సినిమాలు డిస్ట్రీబ్యూట్ చేసే ‘ఎల్.ఏ’ అనే తెలుగు మూవీస్ సంస్థ అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయడానికి ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ సంస్థ ఇదివరకు కళ్యాణ్ రామ్ హీరోగా ‘నా నువ్వే’ సినిమాను నిర్మించింది. తన రెండో సినిమాగా అనుష్క లీడ్ రోల్ లో ఓ సినిమాను ప్లాన్ చేసినట్టు ఫిలింనగర్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారని సమాచారం.
నానువ్వే సినిమా తర్వాత రెండో సినిమాగా అనుష్క ప్రాజెక్టును పట్టాలెక్కియ్యడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ ను పట్టాలెక్కించగానే.. ఓ మాస్ మసాలా మూవీని చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు యూనిట్ వర్గాలు లీక్ చేశాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
కాగా ఇప్పటికే దర్శకుడు యేలేటి చంద్రశేఖర్.. అనుష్కతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేశాడని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా కూడా ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.