సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''నిశ్శబ్దం''. 'అరుంధతి' - 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించిన అనుష్క.. ఈసారి డిజిటల్ స్ట్రీమింగ్ తో సత్తా చాటనుంది. కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో 'నిశ్శబ్దం' చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. 'నిశ్శబ్దం' గురించి స్వీటీ పంచుకున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం!
>> 'నిశ్శబ్దం' ఎలా కార్యరూపం దాల్చింది?
'భాగమతి' మూవీ విడుదలైన తర్వాత కావాలనే కాస్త విరామం తీసుకున్నాను. కోన వెంకట్ గారు - హేమంత్ మధుకర్ గారుతో కలిసి 'నిశ్శబ్దం' స్టోరీ చెప్పినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకమైనదని నేను భావించాను. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించాను.
>> మీరు ఈ చిత్రంలో మూగ యువతి పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. ఆ పాత్ర కోసం ఎలా సన్నద్ధం అయ్యారో చెప్పండి?
హేమంత్ ఈ కథ చెప్పినప్పుడే ఈ చిత్రంలో నాది చెవుడు మరియు మూగ యువతి పాత్ర అని చెప్పాడు. అదే ఈ పాత్ర చేయడానికి నన్ను ఎక్కువగా ఆకర్షించిన అంశం. దీని కోసం మొదట నేను ఇండియన్ సైన్ భాషను నేర్చుకున్నాను. ఆ తరువాత మేము USAకి వెళ్లిన తర్వాత - డిఫరెంట్ సైన్ లాంగ్వేజెస్ ఉంటాయని నాకు తెలిసింది. అక్కడ నేను 14 ఏళ్ల అమ్మాయి దగ్గర అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను.
>> ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్ లో డైరెక్ట్ గా విడుదల చేస్తున్న మీ ఫస్ట్ సినిమా. మీకు ఎలా అనిపిస్తుంది?
ఓటీటీ మరియు థియేటర్స్ అనేవి రెండు స్వతంత్ర సంస్థలు. డిజిటల్ రిలీజ్ పద్ధతిని మనం సానుకూల అవకాశంగా చూడాలి. నా సినిమా OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇది నాకు న్యూ ఎక్సపీరియన్స్ ఇస్తోంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
>> 'నిశ్శబ్దం' సినిమాలో మాధవన్ తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
నా కెరీర్ స్టార్టింగ్ లో మాధవన్ తో కలిసి నటించాను. చాలా కాలం తర్వాత అతనితో నటించడం చాలా గొప్పగా అనిపించింది. ఈ చిత్రంలో మేము చాలెంజింగ్ రోల్స్ లో నటించాము. కానీ ఈ సినిమా మొత్తం మా ఇద్దరి మీదే నడవదు. స్టోరీలోకి మరికొన్ని పాత్రలు వచ్చి అనేక మలుపులు తీసుకుంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్ ను ప్రేక్షకులు ఆనందిస్తారని నాకు నమ్మకం ఉంది.
>> బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ థ్రిల్లర్ లో కీలకమైన అంశం. 'నిశ్శబ్దం' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మీరేమి చెప్తారు?
ఓటీటీ విడుదలలో ఇదొక్కటే లోపం అనుకుంటాను. థియేటర్లలోని సౌండ్ సిస్టమ్స్ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తాయి. కానీ ఇప్పుడు అది ఉండదు. 'నిశ్శబ్దం' సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ అస్సెట్. గోపి సుందర్ యొక్క రీ-రికార్డింగ్ టాప్ నాచ్ లో ఉంటుంది.
>> మీ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గురించి చెప్పండి?
డైరెక్టర్ హేమంత్ మధుకర్ క్లియర్ విజన్ తో పనిచేస్తాడు. అతనికి నటీనటుల నుంచి బెస్ట్ అవుట్ అవుట్ ఎలా రాబట్టుకోవాలో తెలుసు. అతను మమ్మల్ని ముందుండి నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ హౌసెస్ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సింప్లి సూపర్బ్. USAలో రూపొందించిన ఒక ఎక్స్ పెరిమెంటల్ స్టోరీని నమ్మి.. ఇంత భారీ స్థాయిలో నిర్మించిన విధానం ప్రశంసనీయం. మా చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ప్రేక్షకులు దీనిని చూసి ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను.