కరోనాను ఎదుర్కోడానికి బొమ్మాళీ చెప్పిన చిట్కాలు...!

Update: 2020-10-01 01:30 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క - ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నిశబ్దం'. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ మరియు కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ ని రద్దు చేసుకుని.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 2న 'నిశబ్దం' తెలుగు తమిళంతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు కరోనా నుంచి తీసుకోవాలని జాగ్రత్తలు కూడా తెలియజేసింది.

అనుష్క 'నిశబ్దం' సినిమా గురించి మాట్లాడుతూ.. 'సెలైన్స్ అనేది ఓ పవర్‌ ఫుల్ ఆయుధం. అదెలా ఉంటుందో మీకు తెర మీద కనిపిస్తుంది. ఇక సక్సెస్ అనేది మనం నిర్ధారించే అంశం కాదు. కథ విన్నప్పుడు నాకు నచ్చింది. ప్రేక్షకులకు నచ్చేలా కష్టపడి సినిమాను తీసాం. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు మంచి చిత్రాన్ని అందిస్తున్నామనే ఫీలింగ్ మాలో అందరికి ఉంది' అని చెప్పారు. అలానే కరోనా గురించి మాట్లాడుతూ.. 'కరోనా వైరస్‌ ను యోగా ద్వారా అడ్డుకోవచ్చని నేను చెబితే అది తప్పు అవుతుంది. కాకపోతే యోగా ప్రాక్టీస్ అనేది కేవలం శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఉపయోగపడుతుంది. శరీర అంతర భాగం - నాడీ వ్యవస్థలపై పనిచేసి శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా భావోద్వేగాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది' అని అనుష్క పేర్కొంది.

''కరోనా పరిస్థితుల్లో యోగా అనేది కీలకంగా మారింది. కోవిడ్ పేషంట్లకు ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ద్వారా శ్వాస సంబంధమైన ఎక్సర్సైజులు చేస్తే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యోగా చేస్తే సరిపోతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ రోజు కరోనా చూశాం. భవిష్యత్‌ లో మరో ప్రమాదం ఎదురు కావొచ్చు. అందుకే యోగా అనేది ఎప్పుడూ చేయాల్సిందే. ప్రతీరోజు ఒక గంట యోగా చేస్తే మంచిది. యోగాతో శ్వాస ప్రక్రియ మెరుగవడంతో పాటు ఊపిరితిత్తులు బలంగా మారుతాయి'' అని అనుష్క చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News