ఏ జంటనైనా చూడగానే పబ్లిక్ టాక్ ఎలా ఉండాలి. చూడచక్కని జంట.. చిలుకా గోరింకల్లా ఈడు జోడు భలేగా కుదిరింది అని మురిసిపోవాలి. ఊరు ఊరంతా ఇదే టాక్ నడవాలి. కానీ ఇక్కడ జంటను చూస్తుంటే చాలా తేడాగా ఉంది. కాకి ముక్కుకు దొండ పండులా, స్కూటర్ ని ఢీకొట్టే లారీలా కనిపిస్తోందీ జంట.
అవును.. సరిగ్గా ఇదే వ్యూ ఆఫ్ పాయింట్ లో ఓ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించాలని కలగన్నాడు ప్రకాష్ కోవెలమూడి. కె.రాఘవేంద్రరావు తనయుడిగా తనకంటూ ఓ మార్క్ కనబడాలని తపించి సైజ్ జీరో చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకేంద్రుడి పేరు నిలబెట్టాలనే తపనతో చేస్తున్న ప్రయత్నమిది. ఇదిగో ఈ ఫస్ట్ లుక్ తోనే అందరినీ కట్టిపడేశాడు. గుమ్మడి పండు లాంటి అనుష్క పక్కనే అరటిపండు లాంటి ఆర్య ఇలా బిక్క చచ్చిపోయి కనిపిస్తే ఏమనుకోవాలి? అందునా శోభనం గదిలో ఇలాంటి సీను ఎదురైతే .. క్యా సీన్ హై! అంటూ థియేటర్స్ లో విజిల్స్ పడవూ?
ఒబిసిటీ అమ్మాయికి హీరోలాంటి కుర్రాడికి మధ్య రొమాన్స్ ఏంటి గురూ? అని టాక్ నడవదూ? ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంప్రెషన్ కొట్టేశాడు. బొద్దుగా ఉండే అమ్మాయి జీరో సైజ్ కి ఎందుకు మారాల్సొచ్చిందో సైజ్ జీరో సినిమాలో చూడాల్సిందే. అక్టోబర్ 2న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంతవరకూ వెయిట్ అండ్ సీ.