అక్కినేని నాగార్జున-అనుష్కల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘సూపర్’ సినిమాతో అనుష్కను కథానాయికగా పరిచయం చేసింది నాగార్జునే. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి డాన్.. రగడ.. ఢమరుకం.. సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలు చేసి ‘హిట్ పెయిర్’ అనిపించుకున్నారు. వీళ్లిద్దరి వ్యక్తిగత బంధం గురించి కూడా రకరకాల వార్తలొస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుక సందర్భంగా అనుష్క చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తాను నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. ఇది అరుదైన అవకాశమని చెప్పిన అనుష్క.. నాగ్ ప్రస్తావన తెస్తూ ఆయనతో కలిసి ఇలాంటి డివైన్ మూవీ చేస్తానని.. భక్తురాలి పాత్రను పోషిస్తానని అస్సలు ఊహించలేదని చెప్పింది. అంటే నాగార్జున-అనుష్క అనగానే రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి జనాలకు. అలాంటిది వీళ్లిద్దరూ భక్తి చిత్రంలో కనిపించడం.. ఇద్దరూ జంటగా కాకుండా వేంకటేశ్వరస్వామి భక్తులుగా కనిపించడం ఆశ్చర్యం కలిగించేదే.
బహుశా అనుష్క కూడా అందుకే ఆశ్చర్యపోయినట్లుంది. ఈ సినిమాలో అనుష్క.. జగపతిబాబుకు జోడీగా నటిస్తుండటం విశేషం. దీనిపై జగపతి బాబు స్పందిస్తూ.. చాన్నాళ్ల తర్వాత తనకో బంపర్ ఆఫర్ తగిలిందని.. తన మీద ఒక పాట చిత్రీకరించారని.. అది కూడా అనుష్కతో అని పొంగిపోవడం విశేషం. జగపతి-అనుష్క ఇంతకుముందు ‘స్వాగతం’ సినిమాలో ఓ రేంజిలో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/