అనసూయ.. తెలుగు ప్రేక్షకులుకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై పలు షోలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపిస్తోంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో సైతం అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. 'క్షణం' 'ఎఫ్2' 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలక పాత్ర పోషించింది. వెండితెర బుల్లితెరలపై తనదైన శైలిలో రాణిస్తున్న అనసూయ ప్రస్తుతం లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా పాటిస్తోందట. ఇంటికే పరిమితమై రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన అనసూయ తన సినిమాలు.. ఇంటి పనులు.. భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించింది.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ 'నా లాక్‌డౌన్ సక్సెస్‌ఫుల్ గా సాగుతున్నది. ఇంట్లోనే ఉంటూ కరోనాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో పనులు చేస్తూ.. తెలియని వాటిని తెలుసుకుంటూ ప్రతీ రోజు గడిపేస్తున్నాం. గత 35 రోజుల్లో నేను ఒకసారి మాత్రమే బయటకు వెళ్లాను. కాకపోతే కొందరు చేస్తున్న పిచ్చి చేష్టల వల్లే ఇంత తీవ్రతరమైన పరిస్థితి ఏర్పడింది. అందరూ ప్రభుత్వాలు చెప్పినట్టు వింటే లాక్ డౌన్ ఇంతవరకు వచ్చేది కాదు. పిల్లల స్కూల్ ఏమై పోతుందనే బెంగ కలుగుతున్నది. దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ సక్సెస్ ఫుల్ అయ్యేలా చూడాలి. దేవుడు అంతా చూస్తున్నాడు. చుట్టు పక్కల ఉన్న వారికి.. అందరికీ లాక్ డౌన్ పాటించమని చెప్పండి' అని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఫస్ట్ బ్యూటీ పార్లర్ కు వెళ్లి నా రోల్స్‌కు తగినట్టుగా మేకోవర్ చేసుకుంటాను.. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.. కన్నడ సీమ నుంచి రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాటిని ఒప్పుకోలేదన్నారు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకి ముందు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు.. డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుంటూ పోయాను.. లుక్ పరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకున్నానని అనసూయ తెలిపారు.