ఏపీ ముఖ్య‌మంత్రికి ప‌దే ప‌దే అదే అభ్య‌ర్థ‌న‌

Update: 2021-08-06 05:05 GMT
క‌రోనా క్రైసిస్ అన్ని రంగాల కంటే సినీరంగాన్ని పెద్ద దెబ్బ కొట్టింద‌ని విశ్లేషిస్తున్నారు. రెండేళ్లుగా వెంటాడి వేధిస్తోంది వైర‌స్. జ‌నం థియేట‌ర్ల‌కు వచ్చేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. అయినా వినోద రంగం హోప్స్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఓటీటీ డిజిట‌ల్ రంగానికి స్కోప్ పెరిగినా థియేట్రిక‌ల్ రంగానికి వెయిట్ త‌గ్గ‌ద‌నే అంతా విశ్లేషిస్తున్నారు. మ‌హ‌మ్మారీ ఏమాత్రం శాంతించినా త‌మ సినిమాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు వెన‌కాడ‌డం లేదు.

అయితే ఇప్పుడున్న క్రైసిస్ లో ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో మాత్ర‌మే ఎగ్జిబిష‌న్ రంగం నిల‌బ‌డ‌గ‌ల‌ద‌ని సినీనిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు భావిస్తున్నారు. అందుకే ముఖ్య‌మంత్రుల‌కు త‌మ గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులను అభ్య‌ర్థిస్తూ విన‌తిప‌త్రాల‌ను అంద‌జేసింది. ఏపీలో టిక్కెట్టు రేట్ల‌ను పెంచాల్సిందిగా మెమోరండంలో కోరారు.

మ‌రోవైపు ప్ర‌ముఖ నిర్మాత‌లైన డి.సురేష్ బాబు.. ఎన్వీ ప్ర‌సాద్ .. అల్లు అర‌వింద్ .. దిల్ రాజు త‌దిత‌రులు ఏపీలో టిక్కెట్ రేట్ల పెంపు విష‌య‌మై ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. వారంతా బ‌హిరంగంగానే ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో అమల్లో ఉన్న కొత్త రేట్లు సినీరంగానికి పెను విఘాతం అని విశ్లేషిస్తున్నారు. టిక్కెట్టు రేట్లు పెంచ‌నిదే థియేట్రిక‌ల్ రంగం మ‌నుగ‌డ సాగించ‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రిని క‌లిసి త‌మ గోడు విన్న‌వించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది.

తాజాగా ప్ర‌ముఖ నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ వెల్ల‌డించిన ఓ విష‌యం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. థియేట‌ర్ల క్వాలిటీని పెంచేందుకు ఎగ్జిబిట‌ర్లు భారీ మొత్తాల‌ను పెట్టుబ‌డులుగా పెట్టారు. సౌండ్ సిస్టమ్ స‌హా ప్రొజెక్ష‌న్ .. సీటింగ్ వ‌గైరా మార్పులు చేశారు. ప్రొజెక్ష‌న్ క్వాలిటీ కోసం అధునాత‌న సాంకేతిక‌త‌ను కొనుగోలు చేశారు. దీనివ‌ల్ల‌ ఖ‌ర్చులు పెరిగాయి. ఎన్టీ రామారావు హ‌యాంలో స్లాబ్ సిస్టమ్ ని తీసుకువచ్చారు. దివంగత ముఖ్య‌మంత్రి వై.ఎస్.ఆర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లకు ప్రోరేట్ ట్యాక్స్ ప్రాతిపదికను తీసుకువచ్చి సమూల మార్పు చేశారు`` అని తెలిపారు. అలాగే ఏపీ తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రులు థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను కాపాడుతార‌నే ఆశాభావాన్ని ఆయ‌న‌ వ్య‌క్తం చేశారు.

థియేట‌ర్ల మనుగ‌డను కాపాడాల్సిందిగా ఇటీవ‌ల‌ తెలుగు ప్ర‌భుత్వాల‌ను ప‌దే ప‌దే ఎగ్జిబిట‌ర్లు అర్థిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా సాయానికి ముందుకొస్తుంద‌న్న హోప్ ఇప్ప‌టికీ ఉంది.




Tags:    

Similar News