థియేట‌ర్ రంగానికి సీఎం మేలు మ‌రువ‌లేనిది!-ఏపీ ఫిలింఛాంబ‌ర్

Update: 2021-04-10 04:01 GMT
కరోనా మ‌హ‌మ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూతపడిపోయి ఈ రంగంలో కార్మికులకు తీవ్ర ఉపాధి కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. కార్మికుల జీవితాల్లో చెదురుముదురు ఘ‌ట‌న‌లు ఇంత‌కుముందు హెడ్ లైన్స్ లోకి వచ్చాయి. అయితే ఈ రంగంలో క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని ఎగ్జిబిట‌ర్ల‌ను ఆదుకునేందుకు సినీప‌రిశ్ర‌మ‌కు సాయ‌ప‌డేందుకు ముందుకొచ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏపీ ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాలు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాయి.

మ‌హ‌మ్మారీ క్రైసిస్ తో ఇబ్బంది పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు చేయూత నిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలిం ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ వ్య‌వ‌స్థాపక‌ అధ్య‌క్షులు వాసిరెడ్డి భూపాల్ ప్ర‌సాద్.. అధ్య‌క్షులు అంబ‌టి మ‌ధుమోహ‌న కృష్ణ కృతజ్ఞతలు తెలియజేసారు . ఈ మేర‌కు శుక్ర‌వారం విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోట‌ల్ ‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వాసిరెడ్డి భూపాల్ ప్ర‌సాద్‌.. అంబ‌టి మ‌ధుమోహ‌నకృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్- మే- జూన్ నెలలకు సంబందించి థియేటర్ యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్ డ్ కరెంట్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ.. మిగిలిన 6 నెలల ఫిక్స్ ‌డ్ కరెంట్ చార్జీలను వాయిదాలలో చెల్లించుటకు అనుమతినిస్తూ ఏ.బి.సెంటర్స్ వారు  తీసుకున్న రూ.10 లక్షలు.. సి సెంటర్స్ వారు తీసుకున్న రూ.5 లక్షలు రూణాలపై ఉన్న వడ్డీని 50శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు.

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ‌మోహ‌న్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు చెందిన వేలాది మందికి ప్రయోజనం చేకురిందని తెలిపారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప‌లువురు సినీ ప్రదర్శనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సహకరించిన సమాచార .. ప్రజా సంబంధాల శాఖ మంత్రి పెర్ని నానీకి.. ప్ర‌ముఖ సినీ న‌టులు చిరంజీవి.. అక్కినేని నాగార్జునకు.. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ చందర్‌.. మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ త‌రపున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలిం ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ సెక్రటరీ జే.వి.మోహన్ గౌడ్.. వైస్ ప్రెసిడెంట్ పి.విజయవర్మ.. జాయింట్ సెక్రెటరీలు జె.చైత‌న్య‌.. యం.శ్రీనాధరావు.. కమిటీ సభ్యులు వి.వి.రామానుజం.. టి. వెంకటేశ్వర రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
Tags:    

Similar News