ప్రపంచ వ్యాప్తంగా గత రెండు నెలలుగా నెలకొనియున్న పరిస్థితులతో సినిమా రంగం మీద పెద్ద దెబ్బ పడింది. దీనికి భారత సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు. సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
కానీ వినోద రంగం లాంటి వాటికి మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. సాధారణ పరిస్థితులు వస్తే థియేటర్స్ ఓపెన్ అవుతాయని.. షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ లో ముఖ్యపాత్ర పోషిస్తున్న సినిమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుందని.. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని అనుకోవటం లేదని.. అందుకే కనీసం మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం లేదని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితులు చక్కబడితే షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చన్న వారు షాక్ కి గురయ్యారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్టుగా ఏపీలో సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం తమ రాష్ట్రంలో సినిమాల షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చునని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొందట. ఈ జీవోలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ పరిశ్రమకు కాస్త ఊరట లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా షూటింగుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లే. మరి ఏపీలో షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం నిజమైతే తెలంగాణాలో సినిమా మరియు సీరియల్స్ షూటింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అనేది చూడాలి.