ఫిలిం ఇండస్ట్రీ జంప్.. జీవో రెడీ!?

Update: 2018-10-18 06:22 GMT
ఏపీ - తెలంగాణ .. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా సినీప‌రిశ్ర‌మ మాత్రం విడిపోలేదు. టాలీవుడ్ ఒక్క‌టిగానే ఉంది. అయితే ఇది ఇన్నాళ్లుగా పైకి మాత్ర‌మే ఇలా ఉంది. లోలోన సినీ పెద్ద‌ల చూపు మాత్రం ఏపీ వైపేన‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇప్ప‌టికి సైలెంట్‌గా ఉన్నా, మునుముందు ప‌రిశ్ర‌మ త‌ర‌లింపు స‌న్నివేశం త‌ప్ప‌ద‌న్న మాట ప‌లు వేదిక‌ల‌పై విశ్లేషించారు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌స్తుతం ఏపీ ఎఫ్‌డీసీ వేగంగా పావులు క‌దుపుతోంద‌ని స‌మాచారం. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లే జీవోల గురించి ప్ర‌స్థావించారు. జీవో.నం.ఎంఎస్‌ 116 జీవోతో ప‌లు మార్పు చేర్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఏపీలో చిన్న సినిమాల ప్రోత్సాహం కోసం జీవోల్ని తెస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆ జీవో ప్ర‌కారం.. చిన్న బ‌డ్జెట్ సినిమాల‌కు 10ల‌క్ష‌ల స‌బ్సిడీ ఇస్తారు. తొలిగా రిజిస్ట‌ర్ చేయించుకున్న‌ 15 చిన్న సినిమాల‌కు ఈ స‌బ్సిడీ వ‌ర్తింప‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అది అందిపుచ్చుకోవాలంటే హైద‌రాబాద్‌లో ఆఫీస్ ఉంటే కుద‌ర‌దు. ఏపీలో స్థానికంగా సినిమా ఆఫీస్ ఉంటేనే అనే నిబంధన ఉంది. తాజాగా ఈ జీవోలు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై  ఏపీ ఎఫ్‌డీసీ & ప్ర‌భుత్వం అస‌లు ప‌ని మొద‌లెట్టాయ‌ని తెలుస్తోంది. ఇక నెమ్మ‌దిగా చిన్న సినిమాల ఆఫీస్‌లు ఏపీకే వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇక టిక్కెట్టుపైనా జీఎస్టీ 14 శాతం నుంచి 9 శాతానికి త‌గ్గింపు వ‌ర్తింప‌జేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ఉపాధి పెంచాలంటే సినీప‌రిశ్ర‌మ త‌ర‌లింపు అన్న‌ది త‌ప్ప‌నిస‌రి. అందుకు ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. అయితే అక్క‌డ ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు ప్ర‌ముఖంగా `కులం కార్డ్` మోకాల‌డ్డుతోంద‌న్న వాద‌నా స‌రికొత్త‌గా తెర‌పైకొచ్చింది. ఈ ఒక్క అంశం ప‌లు ర‌కాలుగా ట్ర‌బుల్స్‌కి తెర తీసిందిట‌. మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌ను కొంద‌రు అమ‌రావ‌తి, విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని కోరుతుంటే, మెజారిటీ వ‌ర్గం మాత్రం వైజాగ్ అయితేనే బెట‌ర్ అన్న వాద‌నా వినిపిస్తున్నార‌ట‌.
Tags:    

Similar News