కొత్త కోణం తెర‌పైకి తెచ్చిన ఏపీ థియేట‌ర్ య‌జ‌మానులు..!

Update: 2021-07-30 09:45 GMT
తెలంగాణ‌లో నేటి నుంచి థియేట‌ర్లు 100శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో కూడా 50శాతం ఆక్యుపెన్సీతో అనుమ‌తులున్న‌ప్ప‌టీకీ థియేట్లర్లు రీఓపెన్ చేసేందుకు ఎగ్జిబిట‌ర్లు ఆస‌క్తి చూపించ‌డం లేదు. దీనికి తోడు ఏపీలో నైట్ క‌ర్ఫ్యూలు ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పిని తెస్తున్నాయి. ఇప్ప‌టికే యాభై శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయాల‌న్న ప‌రిమితి ఇబ్బందిక‌రం అని థియేట‌ర్ య‌జ‌మానులు భావిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రిత‌మే రాత్రి క‌ర్ఫ్యూల‌ను ఆగ‌స్టు 14 వ‌ర‌కూ పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిబిట‌ర్ల‌ని మ‌రింత నైశార్యంలోకి నెట్టిన‌ట్లైంది. దీనికి తోడు టిక్కెటు ధ‌ర‌లు పెంచాల‌న్న‌ నిర్మాత‌లు,.. ఎగ్జిబిట‌ర్ల డిమాండ్ కు ప్ర‌భుత్వం ఆస‌క్తి చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు ప్ర‌భుత్వ అధికారుల‌తో చ‌ర్చ‌ల‌కు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. త‌మ స‌మ‌స్య‌స‌ల్ని..ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి..త‌గిన‌ విధంగా అనుమ‌తులు వ‌చ్చేలా విజ్ఞ‌ప్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనిలో భాగంగా విద్యుత్ బిల్లులు..నిర్వహణ ఖర్చులు..టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులు బాటు క‌ల్పించ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని అడిగే ఛాన్సుంది. తొలిసారి లాక్ డౌన్ ప‌డిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తీవ్ర న‌ష్టాల్లో ఉన్నామ‌ని.. వాటిని అధిగ‌మించాలంటే ప్ర‌భుత్వ ప్రోత్స‌హాకాలు ప్ర‌క‌టిస్తే సినిమా రిలీజ్ ల‌కు ఆటంకం తొల‌గిపోతుంద‌ని ప్ర‌భుత్వానికి విన్న‌వించ‌నున్నారు.

ఇప్ప‌టికే థియేటర్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా నిరాకరిస్తున్నాయని వారికి ఎలాంటి ఆర్ధిక రక్షణ లేద‌ని ఎగ్జిబిట‌ర్లు ల‌బోదిబో మంటున్నారు. తెలంగాణ లో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌...ఏపీలో థియేట‌ర్ వ్య‌వ‌స్త‌ వేర్వేరు అనే కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అక్క‌డ థియేట‌ర్లు పూర్తిగా నిర్మాత‌లు చేతుల్లోనే ఉంటాయ‌ని.. కానీ ఎపీలో సొంతంగా ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్లు న‌డుపుతున్నార‌ని.. సినిమా రిలీజ్ కు పెట్టుబ‌డి అంతా తామే పెట్టుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. త‌మ స‌మ‌స్య‌ల్ని విన్న‌వించుకునే అవ‌కాశం ప్ర‌భుత్వ అధికారులు త‌మ‌కు క‌ల్పించాల‌ని థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అస‌లే టాలీవుడ్ లో చ‌క్రం తిప్పే చాలామందికి ఏపీలో సింగిల్ థియేట‌ర్ల‌తో సంబంధం లేద‌నేది ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర కోణంగా మారింది. ఆ పాయింట్ నే జ‌గ‌న్ వ‌ద్ద హైలైట్ చేయ‌నున్నార‌ట‌.


Tags:    

Similar News