ఈ టెంపర్ పిల్లను పట్టించుకోండయ్యా

Update: 2016-09-13 05:40 GMT
టెంపర్ మూవీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యాడో చూస్తూనే ఉన్నాం. అక్కడి నుంచి ప్రతీ సినిమాని సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ చేసేస్తూ.. ఇప్పుడు ఇండస్ట్రీ కొట్టే రేంజ్ కి వచ్చేశాడు. అంతలా పూరీ జగన్నాధ్ తీసిన టెంపర్ మూవీ ఎన్టీఆర్ కి కిక్ ఇచ్చింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ తో పాటు.. మర్చిపోలేని మరోపాత్ర  ఉంటుంది. రేప్ విక్టిమ్ గా నటించిన అమ్మాయిని ఎవరూ మరిచిపోలేరు. సినిమాకి అంత కీలకం ఆ రోల్.

టెంపర్ లో రేప్ విక్టిమ్ రోల్ ని మాత్రమే కాదు.. ఆ పాత్రను పోషించిన అమ్మాయిని కూడా ఆడియన్స్ మర్చిపోవడం కష్టం. అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయిన ఆ అమ్మాయి పేరు అపూర్వ శ్రీనివాసన్. హైద్రాబాద్ కు చెందిన అపూర్వ.. జర్నలిజం- ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడెంట్. మిస్ హైదరాబాద్ విన్నర్. మంచి ఆఫర్స్ వస్తే తప్ప వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలనే స్పీడ్ ఈమె చూపించడం లేదు. ప్రయత్నాలు చేయడం లేదని కాదు కానీ.. తనకు తగిన రోల్ వస్తే చేస్తానంటుంది అపూర్వ. మరి ఆమె కోరుకున్నట్లుగా పెర్ఫామెన్స్ రోల్స్ ని మన మూవీ మేకర్స్ ఆఫర్ చేస్తే.. నటించడానికి అపూర్వ రెడీనే. టెంపర్ తరువాత జ్యోతిలక్ష్మి సినిమాలో కూడా చిన్న రోల్ చేసిందీ అమ్మడు. కాని ఆపర్లు మాత్రం రాలేదు.

గత రాత్రి అమ్మడు టాలీవుడ్ థండర్స్ అనే బ్యాడ్మింటన్ టీమ్ లాంచ్ చేసినప్పుడు.. అక్కడి ఈవెంట్లో తెగ సందడి చేసింది. ఓ రకమైన అందాల ఆరబోతతో అందరి కళ్ళనూ తనవైపుకు తిప్పేసుకుంది. ఇవన్నీ చూశాకైనా అవకాశాలు ఇవ్వాల్సిందే మరి.
Tags:    

Similar News