కంటెంట్ ఉంటే చాలు కలెక్షన్ల వర్షం కురుస్తుందన్న విషయం మరోసారి రుజువైనట్లే. అంచనాలు పెద్దగా లేకుండా.. ఎక్స్ ట్రా ప్రచారాలేమీ లేకుండా సైలెంట్ గా థియేటర్లలో ల్యాండ్ అయిన సినమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీ విష్ణు లీడ్ రోల్ లో అదరగొట్టేసాడు ఇంకో ముఖ్యమైన హీరో గా నారా రోహిత్ చేసినప్పటికీ ఈ సినిమాకు దొరికిన థియేటర్లు చాలా.. చాలా తక్కువ. హైదరాబాద్ లాంటి సిటీలోనూ పూర్తిస్థాయిలో విడుదల కానీ ఈ సినిమా మౌత్ టాకే శ్రీరామరక్షగా దూసుకెళుతోంది.
సినిమా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పిరియాడిక్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో కథ.. కథనం డిఫరెంట్ గా ఉండటంతో సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోందట. లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం అన్ లిమిటెడ్ అన్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటివరకూ ఈ సినిమా వసూళ్లు భారీగా ఉన్నాయని.. థియేటర్లు పెరగకున్నా.. 20 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్ల సంఖ్య పెరిగితే మాత్రం ఈ కలెక్షన్ల ఫిగర్ మరింత పెరిగే వీలుందని చెబుతున్నారు.
ఏది ఏమైనా.. వారం మాత్రమే టైం ఉండటం.. ఆ వెంటనే ఖైదీ నంబరు 150.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు థియేటర్లలోకి ఎంటర్ కానున్న నేపథ్యంలో.. ఈసినిమాకు ఇంకా ఏడెనిమిది రోజులు మాత్రమే టైం ఉందని చెబుతున్నారు. అయ్యారేతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ కె చంద్ర.. తన రెండో సినిమాతోనే ఇంత భారీ కలెక్షన్లు సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదని చెబుతున్నారు.
నారా రోహిత్ సినిమా అంటే చాలు.. కాస్త భిన్నంగా ఉంటుందన్న మాటను మరోసారి నిలబెట్టుకున్నాడనే చెప్పాలి.