భారతీయ సినిమా ఖ్యాతిని వినువీధుల్లో విహరింపజేసిన గొప్ప సంగీతదర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. ఆస్కారమే లేని ఆస్కార్ ని అందించి భారత జాతి గౌరవాన్ని ప్రపంచ సినీయవనికపై నిలిపాడు. అంతటి గొప్ప సంగీత దర్శకుడి జీవితాన్ని ఆటోబయోగ్రఫీగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? అయితే అందుకు టైమ్ ఉందింకా. ప్రస్తుతం ఏ.ఆర్.రెహమాన్ వైఎం మూవీస్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో సినిమాలు నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నం '99 సాంగ్స్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు తనే స్వయంగా రాసుకొచ్చాడు.
ఇదో చక్కని ప్రేమకథా చిత్రం. ఓ గాయకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. ఓ గాయకుడు తనని తాను తెలుసుకునే క్రమం ఎలా ఉంటుందో చూపించనున్నారు. కెరీర్ ఆరంభం, స్ట్రగుల్స్, లవ్, గాయకుడు కంపోజర్ గా ఎదిగే క్రమం వంటి విషయాలు ఉంటాయి. అయితే ఇది రెహమాన్ బయోగ్రఫీ మాత్రం కాదు. వాస్తవానికి ఈ సినిమాకి రెహమాన్ స్వయంగా దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం హిందీ, తమిళ్, ఇంగ్లీష్ లో సినిమాలతో బిజీ. అందువల్ల కుదరలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో తమాషా, మొహంజోదారో చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు రెహమాన్.