ఏ.ఆర్‌.రెహ‌మాన్ డాక్యు సిరీస్

Update: 2018-09-27 01:30 GMT
స్వ‌రమాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ అసాధార‌ణ జ‌ర్నీ గురించి - సంగీత ప్ర‌పంచంలో అజేయ‌మైన చ‌రిత్ర గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది ఇసుమంతే. దిలీప్ కుమార్ అనే హిందూ అల్లార‌ఖా రెహ‌మాన్‌ గా మారాడని, ఆ క్ర‌మంలోనే సూఫీ సంగీతంపై ఔపోష‌ణ ప‌ట్టి ఇండియ‌న్ ట్రెడిష‌న‌ల్ ట్యూన్స్‌ కి - వెస్ట్ర‌న్ స్టైల్‌ ని అద్దాడ‌ని చెబుతుంటారు. ప్ర‌పంచంలోనే శూన్యం నుంచి సంగీత ధ్వ‌నుల్ని విని క్రియేట్ చేసే ఏకైక మేధావి ఆయ‌నొక్క‌డేన‌ని కొంద‌రు చెబుతుంటారు. ద‌క్షిణ భార‌త దేశంలో ఇళ‌యరాజా త‌ర్వాత అన్‌ లిమిటెడ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా రెహ‌మాన్ పాపుల‌ర‌య్యారు.

సంగీతంలో పీక్స్ అంటే ఏంటో రెహ‌మాన్ చూపించారు. 6ఏళ్ల నుంచి 60ఏళ్ల వృద్ధుడి వ‌ర‌కూ రెహ‌మాన్‌ ని అభిమానించ‌ని వాళ్లే ఉండ‌రు. అందుకే అత‌డిపై బ‌యో(డాక్యూ) సిరీస్ తీస్తున్నారు అన‌గానే అంద‌రిలోనూ ఒక‌టే ఆస‌క్తి. ఈ డాక్యు సిరీస్‌ లో ఏం చూపిస్తారు?  అన్న ఆస‌క్తి మొద‌లైంది. ప్ర‌ఖ్యాత అమెజాన్ ప్రైమ్ ఆ మేర‌కు ఇప్ప‌టికే రెహ‌మాన్ పై డాక్యు- సిరీస్ తీసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఐదు భాగాలుగా ఈ డాక్యు సిరీస్‌ ని తెర‌కెక్కించ‌నున్నారు. అంటే ఐదు సీజ‌న్‌లుగా ఈ సిరీస్ అమెజాన్‌ లో లైవ్‌ లోకి రానుంది.

రెహ‌మాన్ జీవితంలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని తెలుసుకోవాల‌న్న ఆత్రుత అత‌డి అభిమానుల్లో ఎంత‌గానో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు అత‌డి డాక్యు సిరీస్ కోసం వేచి చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ డాక్యు సిరీస్‌ లో మ‌సాలా కంటే సంగీతం ప‌రంగా విజ్ఞానం అధికంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. వోక‌ల్స్, ఇన్‌ స్ట్రుమెంట్స్ త‌దిత‌ర సంగ‌తుల్ని .. వాటితో రెహ‌మాన్ ప‌నిని విశ్లేషిస్తారు. ఇది న‌వ‌త‌రం సంగీతజ్ఞుల‌కు ఎంతో ఇన్‌ ఫ‌ర్మాటిక్‌ గా ఉంటుందిట‌. సంగీతంపై అద‌ర్‌ సైడ్‌ చాలా విష‌యాల్ని ఈ బ‌యోసిరీస్‌ లో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారట‌. స‌న్నీలియోన్ `క‌ర‌ణ్‌ జీత్` త‌ర‌హాలో య‌థార్థ సంఘ‌ట‌న‌ల‌కు క‌ల్పిత క‌థ‌ను జోడిస్తారా?  లేక ఉన్న‌దున్న‌ట్టే చూపిస్తారా? అన్న‌ది చూడాలి. రెహ‌మాన్ త‌ర‌హాలోనే యోగా గురూ రామ్‌ దేవ్ బాబాపైనా డాక్యు సిరీస్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News