ఆస్కార్ గ్రహీత, స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. స్వరాల పూదోటలో అలుపన్నదే లేని బాటసారిగా సాగిపోతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఓ త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తుండడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఏ.ఆర్.రెహమాన్ సొంత బ్యానర్ వైయమ్ మూవీస్ పతాకంపై `99 సాంగ్స్` అనే చిత్రం తెరకెక్కుతోంది. విశ్వేశ్వర్ కృష్ణ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించడమే గాక స్క్రిప్టు కూడా తనే స్వయంగా సమకూర్చారు. నిర్మాతగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే చిత్రీకరణ మెజారిటీ పార్ట్ పూర్తయింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ జూన్ లోనే రిలీజ్ కి రెడీ చేస్తున్నారట. ఈ చిత్రంతో రెహమాన్ అందరూ కొత్త కుర్రాళ్లనే పరిచయం చేస్తున్నారు. ఇహాన్ భట్, ఎడిల్సి వర్గీస్, తెంజిల్ దల్హా ప్రధాన తారాగణం. వీళ్లతో పాటు లిసా రే, మనీషా కొయిలారా సంగీత దర్శకుడు రంజిత్ బరోట్, రాహుల్ రామ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ మేరకు వివరాల్ని రెహమాన్ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా తెలియజేశారు.
అయితే ఈ సినిమా తెలుగు మీడియాకి రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చా? అంటూ ప్రస్తుతం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారంతా. ఇటీవలే `అవెంజర్స్ ఆంథెమ్` లాంచింగ్ కోసం విచ్చేసిన ఏ.ఆర్.రెహమాన్ కి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. మీరు సంగీతం అందించిన తెలుగు స్ట్రెయిట్ మూవీ ఏదీ హిట్టు కొట్టలేదు.. ఆ ఒక్క హిట్టు ఎప్పటికి సాధ్యం? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కాస్తంత తటపటాయించిన రెహమాన్ జీ `తెలుగు హిట్టు దేవుడినే అడగాలి` అనేశారు. అయితే ఇప్పుడు ఎలానూ స్వయంగా త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి తెలుగు వెర్షన్ తో హిట్టు కొట్టి `ఇదే నా ఆన్సర్` అని చెబుతారా? అన్నది వేచి చూడాలి.