జెంటిల్మన్ - భారతీయుడు - జీన్స్ - ఒకే ఒక్కడు - బాయ్స్ - ఐ - శివాజీ - రోబో - రోబో 2.ఓ....ఇవన్నీ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ - విలక్షణ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లే కావడం విశేషం. శంకర్ సినిమాలలో చాలావాటికి స్వరాలు సమకూర్చింది రెహమాన్. వీరిద్దరి మధ్య మంచి అవగాహన ఉండడంతో ఆ కాంబోలో వచ్చిన పాటలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. విజువలైజేషన్ వెటరన్ శంకర్ - మ్యూజిక్ మెజీషియన్ రెహమాన్ లు ఇండస్ట్రీకి ఆల్ టైం హిట్ సాంగ్స్ ను అందించారు. రోబో 2.ఓ ఆడియో వేడుక సందర్భంగా రెహమాన్ పై శంకర్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అదే వేదికపై ఉన్న రెహమాన్ కూడా శంకర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. జెంటిల్మన్ సినిమానుంచి శంకర్ తో సాగిన ప్రయాణం గురించి అడిగిన సందర్భంగా రెహమాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘జెంటిల్ మెన్’ కు రెహమాన్ సంగీతం అందించారు. ఆ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అప్పటి నుంచి ఇప్పటి రోబో 2.ఓ వరకు ఈ లెజెండరీ పెయిర్ కాంబినేషన్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. రోబో 2.ఓ ఆడియో ఫంక్షన్ వేదికపై రెహమాన్ ను శంకర్ తో సినీ ప్రయాణం గురించి ప్రశ్నించారు. దానిపై రెహమాన్ స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ శంకర్ ఏమీ మారలేదని, అన్నీ అలాగే ఉన్నాయన్నారు. ప్రస్తుతం శంకర్ సరదాగా ఉంటున్నా, ఇప్పటికీ ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరన్నారు. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో శంకర్ రాజీపడరన్నారు. శంకర్ పనిని ఎంతగానో ప్రేమిస్తారని, ఆయన అంకితభావం ఎప్పటికీ తనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. అయితే శంకర్ మాత్రం తాను నా నుంచే స్ఫూర్తి పొందుతుంటానని వినయంగా చెబుతుంటారన్నారు. తమ ఇద్దరి మధ్య ఆ భావం పరస్పరం ఉంటుందని, తామిద్దరం ఒకరి నుంచి ఒకరం స్ఫూర్తి పొందుతుంటమాని రెహమాన్ చెప్పారు. తామిద్దరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయాలని, ఏదైనా కొత్తగా వారికి పరిచయం చేయాలన్న దానిపైనే దృష్టి పెడతామన్నారు.