కోలీవుడ్ స్టార్ అరవింద్ స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మీటూ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులు మరియు చిన్మయి చేస్తున్న మీటూ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో అరవింద్ స్వామి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆ విషయంతో నాకు ఏం సంబంధం అని నన్ను అడుగుతున్నారు అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే నాకు పబ్లిసిటీ వస్తుంది తప్ప మరేం లేదు అన్నాడు.
అరవింద్ స్వామి ఇంకా మాట్లాడుతూ.... ప్రస్తుతం సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉంది. ఆ కారణంగా అంతా కూడా సోషల్ మీడియాలో మీటూ గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. మీటూ ఉద్యమంకు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుపుతూనే వారికి వారు పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నాడు. ఒక వ్యక్తి సమస్యను అడ్డు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు - ఆ తప్పును ఎంతో మంది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చిన్మయి వివాదంపై అరవింద్ స్వామి స్పందిస్తూ... ఆమె కొందరిని విమర్శించినప్పుడు అంతా కూడా వారిని విమర్శించాలని లేదు. ఆమె వైరముత్తు పై ఆరోపణలు చేయడం వల్ల ఆమెకు మద్దతుగా అంతా కూడా వైరముత్తుకు మద్దతుగా నిలవాలని లేదు - ఆయన్ను విమర్శించాలని లేదు. చిన్మయి నింధించింది కదా అని నన్ను కూడా అతడిని నిందించాలంటే ఎలా - నాకు అందుకు సంబంధించిన తగినంత సమాచారం ఇవ్వాలి కదా అన్నాడు. ఎవరి వ్యక్తిగత విషయాలు వారు చెప్పొచ్చు కాని ఇతరుల విషయంలో పబ్లిసిటీ కోసం మాత్రం స్పందించొద్దు అంటూ అరవింద్ స్వామీ మీటూ గురించి మాట్లాడుతూ హితవు పలికాడు.