దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.ఎల్ విజయ్ `తలైవి` టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. ఇంకా పలువురు టాప్ స్టార్లు అమ్మ జీవితంలో కీలక భాగస్వాములైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ పాత్రలో కంగన ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. భారీ ప్రాస్థటిక్స్ తో ప్రయత్నించినా.. అమ్మ రూపురేఖలు కంగనకు యాప్ట్ కాలేదని విమర్శలొచ్చాయి. ఫస్ట్ లుక్ రివీల్ కాగానే నెటిజనులు కామెంట్లు... మీమ్స్ తో రచ్చ చేసారు. నేచురాలిటీ మిస్సయ్యిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో యూనిట్ ఆ పాత్ర ఆహార్యం ప్రోస్థటిక్స్ లో తప్పులను సరిదిద్దుకునే పనిలో పడింది.
తదుపరి కంనగకు సంబంధించి ఏ పోస్టర్ రిలీజైనా అమ్మ ముఖకవలికలు.. ఆహార్యం ఉట్టిపడేలా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక జయలలిత జీవితంలో కీలక ప్రముఖుడు.. లెజెండరీ నటుడు ఎంజీ రామచంద్రన్. రాజకీయ నాయకుడిగా... నటుడిగా తమిళనాట ఆయన ఖ్యాతి గురించి చెప్పాల్సిన పనిలేదు. జయలలితతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. ఈ నేపథ్యంలో తలైవిలో రామచంద్రన్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో అందాల నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు.
తాజాగా శుక్రారం ఎంజీ రామచంద్రన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన పస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఎంజీఆర్ ఆహార్యంలో అరవింద్ స్వామి ఒదిగిపోయారు. అచ్చంగా ఎంజీఆర్ కి జెరాక్స్ కాపీలా ఉన్నారు. రింగు రింగుల జుత్తు ..యవ్వనశిరులు... కళ్లకు నల్లా అద్దాలు.. టీషర్ట్ ధరించి అభివాదం చేస్తోన్న లుక్ లో ఎంజీఆర్ ని గుర్తు చేసింది యూనిట్. ఆ పాత్రకు అరవింద్ స్వామి తప్ప మరో నటుడు న్యాయం చేయలేడు అన్నంతగా డిజైన్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలోనూ జోరుగా వైరల్ అవుతోంది.