అతణ్నలా చూసి అమ్మాయిలు తట్టుకోగలరా?

Update: 2015-08-26 14:16 GMT

Full View
90ల్లో అటు తమిళంలో, ఇటు తెలుగులో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేశాడు అరవింద్ స్వామి. స్టార్ ఇమేజ్ లేకపోయినా.. అతడంటే అప్పటి అమ్మాయిలకు పిచ్చి. రోజా, బొంబాయి, మెరుపు కలలు లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు అరవింద్ స్వామి. చేసింది తక్కువ సినిమాలే కానీ.. అతడు వేసిన ముద్ర మాత్రం బలమైంది. ఐతే చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసిన అరవింద్.. ఉన్నట్లుండి వెండితెరకు దూరమైపోయాడు. దాదాపు దశాబ్దం తర్వాత అతణ్ని ఓ షాకింగ్ అవతారంలో చూసి జనాల దిమ్మదిరిగిపోయింది. మధ్యలో ఓ యాక్సిడెంట్ వల్ల చాన్నాళ్లు మంచానికి పరిమితమైపోవడంతో బాగా లావయ్యాడు, జుట్టు కూడా పోయింది. ఆ అరవింద్.. ఈ అరవింద్ ఒక్కరేనా అని డౌటొచ్చింది జనాలకు.

ఐతే అరవింద్ కొత్త అవతారం గురించి ఎక్కువమందికి తెలిసేలోపు సన్నబడి.. హెయిర్ వీవింగ్ చేయించుకుని మణిరత్నం ‘కడలి’ సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడతను. ఆ సినిమా ఫ్లాపైనా అరవింద్ ను మళ్లీ తెరపై చూడ్డం ఆయన అభిమానులకు ఆనందాన్నిచ్చింది. రీఎంట్రీలో చేసిన తొలి సినిమాలో పాజిటివ్ క్యారెక్టరే చేశాడు అరవింద్. కానీ తర్వాతి సినిమాలో అతను క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తనీ ఒరువన్’లో అరవిందే విలన్ పాత్రధారి. రవి అన్నయ్య రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార కథానాయిక. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూస్తే విలన్ క్యారెక్టర్ చాలా బలంగా, స్టైలిష్ గా ఉంటుందని.. అరవింద్ అదరగొట్టేశాడని అర్థమవుతోంది. అంతా ఓకే కానీ.. అరవింద్ ను విలన్ పాత్రలో చూసి అతడి లేడీ ఫ్యాన్స్ తట్టుకోగలరా అన్నదే డౌటు.
Tags:    

Similar News