అరవింద్ స్వామి చేయనంటున్నాడే..

Update: 2015-09-15 22:30 GMT
తనీ ఒరువన్.. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆగస్టు 28న పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్టయింది. అక్కడ హిట్టవడమే కాదు.. వేరే ఇండస్ట్రీల దృష్టిని సైతం ఆకర్షించింది. దాదాపు ఐదు భాషల నుంచి ఈ సినిమాను రీమేక్ చేయడానికి విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుగులో డీవీవీ దానయ్య ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలున్నాయంటున్నారు. ఐతే హీరో మారడం పెద్ద విషయం కాదు కానీ.. ఈ సినిమాలో మేజర్ హైలైట్ గా నిలిచిన అరవింద్ స్వామి పాత్రను ఎవరు రీప్లేస్ చేస్తారన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

పైకి హీరోలా, మంచి వాడిలా కనిపించే విలన్ పాత్రలో అరవింద్ స్వామి చెలరేగిపోయాడు. ఇంతకుముందన్నీ హీరో, పాజిటివ్ పాత్రలే వేసిన అరవింద్ ను ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్ లో చూసి థ్రిల్లయ్యారు తమిళ ప్రేక్షకులు. సినిమా చూశాక అరవింద్ కాకుండా ఇంకెవర్నీ ఆ పాత్రలో ఊహించుకోలేనట్లుగా మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు అరవింద్. తనీ ఒరువన్ ను రీమేక్ చేయాలనుకున్న ఎవరైనా అరవింద్ నే విలన్ రోల్ కు తీసుకోవాలనుకుంటారనడంలో సందేహం లేదు. ఐతే అరవింద్ మాత్రం ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రీమేకుల్లో నటించే ఉద్దేశం లేనట్లుగా మాట్లాడాడు. తాను చేసేదే చాలా తక్కువ సినిమాలని.. మళ్లీ ఒకే పాత్రను చేయడానికి అంత ఎగ్జైట్మెంట్ ఉండదని అంటున్నాడు  అరవింద్. మరి తెలుగులో కానీ.. మరో భాషలో కానీ.. అరవింద్ పాత్రను ఎవరితో రీప్లేస్ చేస్తారన్నది ఆసక్తికరం.
Tags:    

Similar News