వెండితెరపై క్లాసిక్స్ అనదగ్గ పాత్రలతో అరవింద స్వామి నటనాభినయం నిరంతరం చర్చల్లో ఉంటుంది. బొంబాయి- మెరుపుకలలు- నవాబ్ - ఓకే బంగారం సహా ఎన్నో చిత్రాలలో అద్బుత నటనతో ఆకట్టుకున్నారు స్వామి. ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో క్లాస్ విలన్ పాత్రతో రక్తి కట్టించాడు. అరవింద స్వామి ఇకపై మరిన్ని ప్రయోగాలతో అలరించనున్నారు.
సెల్వ దర్శకత్వం వహిస్తున్న `వనంగముడి`లో అరవింద్ స్వామి రకరకాల రూపాల్లో కనిపించనున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా ఆరు విభిన్న గెటప్ లలో కనిపిస్తాడని తెలిసింది.. వాస్తవానికి ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ లో మేకర్స్ ఈ లుక్స్ ని ప్రేక్షకులకు అందించారు.
ఈ చిత్రంలో అరవింద్ స్వామి అన్బజగన్ పాత్రలో నటించారు. ఒక పోలీసు అధికారి జీవితాన్ని ఈ పాత్ర ఆవిష్కరిస్తుంది. అతని వయస్సు ఆధారంగా వివిధ బ్లాక్ లుగా వర్గీకరించవచ్చు. అరవింద్ స్వామి తన పాత్ర కోసం అనేక రూపాలతో అలరిస్తారు. ప్రతి భాగాన్ని యూనిక్ గా చేసేందుకు అతను కఠినంగా శిక్షణ పొందాడు. సరైన ఆహారాన్ని తింటున్నాడు. అతడి మేకోవర్ సర్ ప్రైజ్ చేస్తుందని చిత్రబృందం వెల్లడిస్తోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. “ఇది ఒక పోలీసు కథ. సాధారణ యాక్షన్ డ్రామా కాదు. అరవింద్ స్వామి పాత్ర తన తెలివితేటలను ఉపయోగించి కేసును ఛేదించడానికి ఏం చేశాడు? నేరస్థుడిని ఎలా కనుగొన్నాడు? అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం పోలీస్ ఆఫీసర్ జీవితాన్ని దినచర్యను ప్రదర్శిస్తుంది. స్వామి అద్భుతంగా నటించారు. అతని కెరీర్ లో ముఖ్యమైన సినిమా అవుతుంది`` అని తెలిపారు.
ఈ చిత్రంలో సిమ్రాన్- రితికా సింగ్- నందిత శ్వేత- చాందిని- తంబి రామయ్య - జయప్రకాష్ తదితరులు నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించగా గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఆంథోనీ ఎడిటింగ్ ని అందిస్తున్నారు.