స్టార్ హీరోల సినిమాల లెక్కలు మారిపోవడం, అనుకున్న దానికి మించిన స్థాయికి వెళ్లిపోవడం అందరికి తెలిసిందే. అయితే కరెక్ట్ గా ఇదే బడ్జెట్ తో తీయాలి.. ఇంతకు మించి ఖర్చే చేయకూడదని బడ్జెట్ లెక్కలు పెట్టుకుంటే మాత్రం బడ్జెట్ పెరగడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఇటీవల సంభవించిన విపత్తు కరోనా కారణంగా కూడా చాలా వరకు చిత్రాల షూటింగ్ లు డిలే కావడం.. అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోవడం వంటి కారణాల వల్ల కూడా చాలా వరకు స్టార్ హీరోల చిత్రాలకు అనుకున్న దానికి మించి బడ్జెట్ పెరిగిపోయింది కూడా.
ఇటీవల విడుదలైన రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ చిత్రాలకు కూడా ఈ సమస్య ఇబ్బందికరంగా మారి అదనంగా బడ్జెట్ ని పెంచేసింది కూడా. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' చిత్రం కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటోందా? అంటే అలాంటిది ఏమీ లేదు కానీ అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్, మహేష్ మైనర్ ఆపరేషన్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. మైత్రీ మూవీమేకర్స్ , 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ముందు అనుకున్న బడ్జెట్ కంటే తాజాగా ఈమూవీకి బడ్జెట్ పెరిగిందని చెబుతున్నారు. పెరిగిన బడ్జెట్ ని బట్టి హీరో సూపర్ స్టార్ మహేష్ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఈ చిత్రం మారినట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేయడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారట. పెరిగిన బడ్జెట్ కు అనుగణంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ప్రస్తుతం మేకర్స్ హ్యాపీగా వున్నారట. అంతే కాకుడంఆ ఈ ప్రాజెక్ట్ రషెస్ చూసుకున్న మేకర్స్ సినిమా సాధించబోయే విజయంపై పూర్తి కాన్ఫిడెంట్ తో వున్నట్టుగా చెబుతున్నారు. ఈ మూవీ బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం కీలక ఘట్టాలని స్పెయిన్, గోవాలలో చిత్రీకరించడమేనని తెలిసింది. అయితే ఆ కారణంగా బడ్జెట్ పెరిగినా సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్స్ చాలా కూల్ గా వున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇటీవల విడుదల మహేష్ బర్త్ డే బ్లాస్ట్ పేరుతో విడుదల చేసిన వీడియో, లిరికల్ వీడియోలు ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తమన్ అందించిన సంగీతం నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే 'పోకిరి' వైబ్స్ కనిపిస్తున్నాయని మహేష్ స్వయంగా హింట్ ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఇక మరోసారి సమరమే.. అంటూ ఈ మూవీ రిలీజ్ కోసం రెడీ అయిపోతున్నారు. త్వరలోనే షూటింగ్ ని పూర్తి చేసి చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.