'RRR' బుకింగ్స్ అక్క‌డ అంత లేదా?

Update: 2022-03-22 12:30 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రిలీజ్ అవుతోన్న `ఆర్ ఆర్ ఆర్` బుకింగ్స్ ఇప్ప‌టికే ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే.  తెలుగు  రాష్ర్టాల్లో అడ్వాన్స  బుకింగ్  టిక్కెట్లు  హాట్  కేకుల్లా అమ్మ‌డుపోతున్నాయి. అమెరికాలో బుకింగ్స్ లోనే అదే వేగం క‌నిపిస్తుంది. చ‌ర‌ణ్‌-తార‌క్- జ‌క్క‌న్న త్ర‌యం ఇమేజ్ ఆ మూడు చోట్లా అసాధార‌ణంగా క‌నిపిస్తుంది. క‌ర్ణాట‌క‌లోనూ బాగానే  ఉంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  క్రేజ్  న‌డుమ అక్క‌డా టిక్కెట్లు బానే తెగుతున్నాయి. మరి మిగ‌తా చోట్ల ప‌రిస్థితి ఎలా ఉంది అంటే?

ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో అంత  వేగం క‌నిపించ‌లేదు. అయితే బేసిక్ గానే తెలుగు సినిమాల‌కు అక్క‌డ క్రేజ్ మొద‌టి నుంచి లేదు. భాషా బేధం అక్క‌డ ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తుంది అన్న‌ది వాస్త‌వ‌మ‌ని మ‌రోసారి తేట‌తెల్ల‌మ‌లైంది. `బాహుబ‌లి-2` రిలీజ్ స‌మ‌యంలోనూ  ఇదే స‌న్నివేశం క‌నిపించింది. అయితే కేర‌ళ రాష్ర్టంలో పరిస్థితి త‌మిళ‌నాడు క‌న్నా మ‌రింత నెమ్మ‌దించిన‌ట్లు తెలుస్తోంది. సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ డ‌ల్ గా ఉన్నాయని స‌మాచారం.  

ఈ సినిమా కేర‌ళ థియేట్రిక‌ల్ రైట్స్ విలువ‌ 10 కోట్లు. లాభాల జోన్ లోకి రావాలంటే 12 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల్సి ఉంది. కానీ ప‌రిస్థితి మొద‌ట్లో నీర‌సించింది. 10 కోట్ల పెట్టుబ‌డి రాబ‌ట్ట‌డం అక్క‌డ అంత వీజీ కాదు. సినిమా రిలీజ్  అయి మొద‌టి షోతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రావాలి. మౌత్ టాక్ తో సినిమా రాష్ర్ట వ్యాప్తంగా ఫేమ‌స్ అవ్వాలి. అప్పుడే అక్క‌డ బ్రేక్ ఈవెన్ కి అవ‌కాశం ఉంటుంది.

ఆఛాన్సెస్ అయితే క‌నిపిస్తున్నాయి. రాజ‌మౌళి తెర‌కెక్కించిన గ‌త చిత్రం `బాహుబ‌లి` కేర‌ళ‌లో పెద్ద స‌క్సెస్ అయింది. అక్క‌డా `బాహుబ‌లి` మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. కానీ `ఆర్ ఆర్ ఆర్` విష‌యంలో బాహుబ‌లి ఇమేజ్.. జ‌క్క‌న్న మార్క్ అక్క‌డా వ‌ర్కౌట్ అవుతున్న‌ట్లు క‌నిపించ‌లేదు.

అయితే `ఆర్ ఆర్ ఆర్` అక్క‌డా ఫ్రీ జోన్ లో రిలీజ్ అవుతుంది. రెండు వారాల పాటు `ఆర్ ఆర్ ఆర్`  కి స్థానిక సినిమాల నుంచి  ఎలాంటి పోటీ లేదు. కాబ‌ట్టి సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తే కేర‌ళ‌లోనూ `ఆర్ ఆర్ ఆర్` కి తిరుగుండ‌దు అన్న టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌లే హిందీలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `పుష్ప` పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి  తెలిసిందే.  అక్క‌డ అనూహ్య‌మైన వ‌సూళ్ల‌తో హిందీ బాక్సాఫీస్ నే షేక్ చేసింది. కేర‌ళ‌లో `ఆర్ ఆర్ ఆర్` కూడా అదే స‌న్నివేశం రిపీట్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం మేక‌ర్స్ లో క‌నిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే 10 కోట్ల‌కు సినిమాని విక్ర‌యించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News