పాట‌లు డ్యాన్సులు ఫైటింగులా..? ఏంటో ఈ సిత్రం?

Update: 2021-03-28 15:30 GMT
పక్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి.. కంటెంట్ బేస్డ్ క‌ల్ట్ సినిమాల‌కు మ‌ధ్య తేడా తెలిసిన‌దే. స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల‌తో నేరేష‌న్ రియల్ లైఫ్ ని త‌ల‌పిస్తే అది క‌ల్ట్ జోన‌ర్ లోకి వ‌స్తుంది. అలా కాకుండా ఎగ్జాగ‌రేష‌న్ తో పాట‌లు ఫైట్లు డ్యాన్సులు చూపించేవి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని అంటారు.

ఈ రెండిటిలో వ‌కీల్ సాబ్ ఏ జోన‌ర్ కి చెందుతుంది? అన్న డిబేట్ చాలా కాలంగా న‌డుస్తోంది. హిందీ మాతృక `పింక్` క‌ల్ట్ జోన‌ర్ లో తెర‌కెక్కింది. అన‌వ‌స‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ హంగులేవీ ఉండ‌వు. సీరియ‌స్ నేప‌థ్య‌మే అయినా ఎమోష‌న్ డ్రైవ్ చేస్తూ బిగ్ బి అంత పెద్ద స్టార్ తో గొప్ప‌గా తీసార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత త‌మిళంలోనూ ఇంచుమించు య‌థాత‌థంగానే తీశారు.. అక్క‌డ త‌ళా అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా పెద్ద హిట్ట‌య్యింది.

తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వకీల్ సాబ్ టైటిల్ తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా ప్ర‌మోలు స‌హా ప్ర‌తిదీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఒరిజిన‌ల్ తో సంబంధం లేకుండా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని ఆదిత్య శ్రీ‌రామ్- దిల్ రాజు బృందం యాడ‌ప్ చేయ‌డం క‌నిపిస్తోంది. పాట‌లు డ్యాన్సులు ఫైటింగులు ఇవ‌న్నీ చాలా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాని త‌ల‌పిస్తాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

నిజానికి ఇటీవ‌లి కాలంలో తెలుగు ఆడియెన్ మైండ్ సెట్ మారింది. నాలుగు పాట‌లు ఐదు ఫైట్లు అంటూ అస‌లు కంటెంట్ లేకుండా తీస్తే చూసేందుకు జ‌నం సిద్ధంగా లేరు. ఒరిజిన‌ల్ లోని క‌థ‌ను మిస్ చేయ‌కుండా డైవ‌ర్ట్ చేయ‌కుండా క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని జోడించి ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది. అలా కాకుండా సీరియ‌స్ ఎలిమెంట్ ని ఎమోష‌న్ ని తెర‌పైకి తేవ‌డంలో తేడాలొస్తే .. ఆ క‌మ‌ర్షియ‌ల్ అంశాలే మైన‌స్ గా మారేందుకు ఆస్కారం లేక‌పోలేదు. 2 గంట‌ల 16 నిమిషాల సినిమాని 3 నిమిషాలు త‌క్కువ 3 గంట‌ల నిడివితో తెర‌కెక్కించార‌న్న‌ది తాజా వార్త‌. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ - ఆదిత్య శ్రీ‌రామ్- దిల్రాజు బృందం వ‌కీల్ సాబ్ విష‌యంలో ఇంత సుదీర్ఘ నిడివితో ఎలాంటి మ్యాజిక్ చేయ‌నుందో వేచి చూడాలి. వ‌కీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.
Tags:    

Similar News