ఇప్పడు ఎక్కడ చూసినా క్రేజీ జంటలు పెళ్లికి రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గత కొంత కాలంగా వివాహం చేసుకోవాలని ఎదురుచూసిన విషయం తెలిసిందే. కోవిడ్ కి ముందే వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ కాలం కలసి రాకపోవడంతో అర్థాంతరంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. చివరికి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ కావడం తో ఏప్రిల్ 14న అత్యంత వైభవంగా ఇరు కుటుంబాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాకగా పెళ్లి చేసుకున్నారు.
వీరి తరహాలోనే గత కొన్నేళ్లుగా ప్రేమలో వున్న కోలీవుడ్ క్రేజీ జంట నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఏడాది క్రితమే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట గత ఐదేళ్లుగా ప్రేమలో వుంటూ వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి గురించి అడిగిన ప్రతీసారి సమాధానం దాటవేస్తూ వస్తున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లికి సిద్దం కాబోతోంది. ఇందులో భాగంగానే గత ఏడాది మార్చిలో సీక్రెట్ గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యే ఎంగేజ్ మెంట్ జరుపుకుంది.
ఆ తరువాత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి సర్ ప్రైజ్ చేసింది. అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నా ఈ జంట మాత్రం ఆ వార్తలని కన్ఫర్మ్ చేయడం కానీ కండించడం కానీ చేయడం లేదు. శని దోశ పూజ అంటూ చెన్నైలోని గుళ్లూ గోపురాలు తిరుగుతూ ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇదిలా వుంటే వీరి పెళ్లి జూన్ 9న చెన్నైలో వివాహం జరగనుందని ఇటీవల వార్తలు మొదలయ్యాయి.
చెన్నైలో పెళ్లి పార్టీ, తిరుపతిలో పెళ్లి అంటూ మరో వార్త కూడా నెట్టింట సందడి చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం చెన్నైలోనే నయన్, విఘ్నేష్ ల వివాహం జూన్ 9న అట్టహాసంగా జరగనుందని తెలుస్తోంది.
జూన్ 9 కి మరో 20 రోజులు మాత్రమే వుండటంతో ఈ జంట పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లని మొదలు పెట్టినట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులతో పాటు కొంత మంది అతిథులు మాత్రమే పాల్గొన నున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత చెన్నైలోని ఓ గ్రాండ్ హోటల్ లో సెలబ్రిటీల కోసం భారీ పార్టీని ప్లాన్ చేస్తున్నారట. ఈ పార్టీలో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, మాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొంటారని చెబుతున్నారు.