`ల‌వ్ స్టోరి` ల‌క్కు ఎంత.. క‌రోనా డిసైడ్ చేయాలి!

Update: 2021-09-17 23:30 GMT
నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ల‌వ్ స్టోరీ` ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 24న థియేట‌ర్లో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.  సెకెండ్ వేవ్ కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా చివ‌రిగా ఈ నెల‌ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇక థియేట‌ర్ల‌ల‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. థియేట‌ర్లో మాత్ర‌మే చూడాల్సిన సినిమా అని ఎన్నో ఓటీటీ ఆఫ‌ర్ల‌ని కాద‌ని క‌మ్ములా నిర్మాత‌లు థియేట‌ర్లోకే ఫిక్స్ అయి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

గోపీచంద్ `సీటీమార్` త‌ర్వాత వ‌స్తోన్న స్టార్ హీరో  చిత్రం కావ‌డం..ఫిదా త‌ర్వాత క‌మ్ములా చాలా గ్యాప్ తీసుకుని తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో  భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్ -తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఏపీలో  50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. టిక్కెట్ ధ‌ర‌ల‌పై ఇంకా క్లారిటీ  రాలేదు. ఈనెల 20న సినీ పెద్ద‌ల‌తో ప్ర‌భుత్వం భేటీ త‌ర్వాత ఓ క్లారిటీ వ‌స్తోంది. ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచుకోమ‌ని అనుమ‌తిస్తే పెరిగిన ధ‌ర‌ల‌తోనే ల‌వ్ స్టోరీ మార్కెట్ లోకి వ‌స్తుంది. లేదంటే పాత ధ‌ర‌ల‌కే అమ్మాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ‌లో 100 శాతం ఆక్యుపెన్సీలో రిలీజ్ అవుతుంది. నైజాం లో క‌మ్ములా సినిమాల‌కు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ స్లాంగ్ లో తెరకెక్కించిన `ఫిదా` తోనే శేఖ‌ర్ క‌మ్ములా బ్రాండ్ గా వెలిగిపోతున్నారు. అప్ప‌ట్లో `ఫిదా` నైజాం లో భారీ వ‌సూళ్ల‌ను సాధించింది.

ఈ నేప‌థ్యంలో ల‌వ్ స్టోరీకి  అంత‌టి రీచ్ ఉంటుందా అన్న‌ది చూడాలి.  అటు తెలంగాణ ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌లు పెంచుతూ తాజాగా ఉత్వ‌ర్వులు కూడా ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ కి 150..మ‌ల్టీప్లెక్స్ లో 200 రూ..లు వ‌ర‌కూ ధ‌ర పెరిగింది. `ల‌వ్ స్టోరీ` హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. పెరిగిన ధ‌ర‌లు.. శేఖ‌ర్ క‌మ్ములా తెలంగాణ బ్రాండ్ తో భారీ వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంది. అయితే ఇదంతా  జ‌ర‌గాలంటే ముందుగా ప్రేక్ష‌కులు క‌రోనా భ‌యంవీడి బ‌య‌ట‌కు రావాలి. ధైర్యంగా జ‌నాలు థియేట‌ర్లుకు వ‌స్తేనే ఇదంతా జ‌రుగుతుంది. లేదంటే  క‌థ మొద‌టికే వ‌స్తుంది.
Tags:    

Similar News