బోయపాటికి స్టార్స్‌ మొహం చాటేస్తున్నారా?

Update: 2021-04-18 06:30 GMT
యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన బోయపాటి శ్రీను గత చిత్రం వినయ విధేయ రామతో మొత్తం క్రేజ్ ను పోగొట్టుకున్నాడు. ఆయనతో సినిమా అంటేనే బాబోయ్ అన్నట్లుగా స్టార్ హీరోలును ఆలోచనల్లో పడ్డారట. ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ' సినిమాను చేస్తున్న బోయపాటి ఆ తర్వాత చేయబోతున్న సినిమా పట్ల రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ ఇటీవల బోయపాటి కథ విని ఓకే చెప్పాడని కొందరు.. ఎన్టీఆర్‌ తో కూడా బోయపాటి సినిమా ఛాన్స్ ఉందని కొందరు రవితేజ తో బోయపాటి సినిమా చేయబోతున్నాడు అంటూ లేదు చిరంజీవితో సినిమా అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే బోయపాటి అఖండ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్‌ తో సినిమా చేయబోతున్నాడట.

లాక్ డౌన్‌ సమయంలో వీరిద్దరి మద్య కథా చర్చలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే దర్శకుడు బోయపాటికి మరియు హీరో కళ్యాణ్‌ రామ్‌ కు కూడా అడ్వాన్స్‌ లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. దాంతో తమ్ముడు ఎన్టీఆర్‌ ఈ కాంబినేషన్ ను సెట్‌ చేసి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు బోయపాటి కి స్టార్‌ హీరోలు అంతా కూడా మొహం చాటేస్తే అప్పుడు ఈ సినిమా ను చేసేందుకు బోయపాటి కమిట్ అయ్యాడేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన బోయపాటి వినయ విధేయ రామ సినిమాతో పోయిన పేరును అఖండ సినిమాతో దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖండ సినిమా తో బాలయ్యకు ఫుల్‌ పవర్ ప్యాన్‌ ప్రాజెక్ట్‌ ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ మరియు అంతకు ముందు వచ్చిన చిన్న వీడియో బిట్‌ సినిమా లో బాలయ్యను బోయపాటి ఎంత పవర్‌ ఫుల్‌ గా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కనుక ఖచ్చితంగా సినిమా మరో లెవల్‌ లో ఉంటుందని అంటున్నారు. అఖండ విజయాన్ని సాధించి కళ్యాణ్‌ రామ్‌ తో చేయబోతున్న సినిమా కనుక సక్సెస్‌ అయితే బోయపాటి వెనుక మళ్లీ స్టార్‌ హీరోలు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News