కొర‌టాల మూవీలో ఎన్టీఆర్ మేన‌రిజ‌మ్స్ ఇవేనా?

Update: 2022-12-13 17:30 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన‌ 'RRR' వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లని పాన్ ఇండియా స్టార్ లుగా నిల‌బెట్టింది. ఈ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌సూళ్ల‌తో పాటు ప‌లు అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ద‌క్కుతున్నాయి. రీసెంట్ గా ప్ర‌ఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2023 కి 'RRR' రెండు విభాగాల్లో నామినేట్ కావ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.  చిత్ర బృందంపై ప‌లువురు స్టార్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ అభినందిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌క‌టించి అందులో శంక‌ర్ మూవీని పూర్తి చేయ‌బోతున్నాడు. కానీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్ప‌టికీ త‌న 30వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌లేక‌పోతున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తో ఎన్టీఆర్ త‌న 30వ ప్రాజెక్ట్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి నెల‌లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం లేదు.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జ‌న‌వ‌రిలో లాంఛ‌నంగా పూజా కార్యక్ర‌మాలు నిర్వ‌హించి ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త రోజు కొక‌టి బ‌య‌టికి వ‌చ్చి నెట్టింట వైర‌ల్ అవుతోంది. తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ మేకోవ‌ర్‌, మేన‌రిజ‌మ్స్ పై ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చక్క‌ర్లు కొడుతోంది.

సినిమాలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో స‌రికొత్త హెయిర్ స్టైల్ తో క‌నిపిస్తాడ‌ని, ఇందు కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నార‌ని, అలాగే మేన‌రిజ‌మ్ కూడా భిన్నంగా వుంటుంద‌ని, సినిమాలో ఎన్టీఆర్ చేతికి ఆరో వేలు వుంటుంద‌ని, కోపం వ‌చ్చిన ప్ర‌తీ సారి అది బిగుసుకుపోతుంద‌ని, అదే ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఆగ్ర‌హానికి చిహ్నంగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. కొర‌టాల శివ - ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్' సూప‌ర్ హిట్ గా నిల‌వ‌డం, ఎన్టీఆర్ ని స‌రికొత్త గా ప్ర‌జెక్ట్ చేయ‌డంతో తాజా వార్త‌ల‌ని ఎన్టీఆర్ అభిమానులు కూడా బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News