రాజుగారుకి పోటీగా ఆ ముగ్గురు?

Update: 2022-10-24 11:30 GMT
టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజ్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌య్య‌ర్ గా మొద‌లై ..అటుపై డిస్ర్టిబ్యూష‌న్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అంచ‌లంచెలుగా ఎదిగారు. అటుపై నిర్మాత‌గానే ఎంతో  వేగంగా పైకెగిన దిగ్గ‌జం. ఇదంతా ఒక్క రోజులో వ‌చ్చిన స‌క్సెస్ కాదు. కొన్ని సంవ‌త్స‌రాల పాటు శ్ర‌మిస్తే ద‌క్కిన విజ‌యం. అందుకే నైజాం మార్కెట్ త‌ని ఏకఛత్రాధిపత్యం  తిప్పుతున్నారు.

మార్కెట్ నే శాషిస్తున్నారు. క‌థ‌ని జ‌డ్జ్ చేయ‌డం  ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ ..ఆ త‌ర్వాత స‌క్సెస్..ఫెయిల్యూర్ అన్ని ప‌క్కాగా జ‌డ్జ్ చేయ‌గ‌ల గొప్ప దిగ్గ‌జం ఆయ‌న‌. అల్లు అర‌వింద్..సురేష్ బాబు లాంటి మార్కెట్ నిపుణుల స‌ర‌స‌న అనతి కాలంలోనే చేరారు? అంటే  రాజుగారి స‌త్తాని త‌క్కువ చేయ‌డానికి  ఏమాత్రం ఛాన్స్ లేదు. ఆ ర‌కంగా నైజాం సినిమా పంపిణీ లో  ఇంత వ‌ర‌కూ ఆయ‌న‌కు పోటీనే  లేదు.

పోటీగా వ‌చ్చిన వాళ్ల‌ని పడ‌గొట్టి నిల‌బ‌డిని ఘ‌న‌త‌త్వం ఆయ‌న సొంతం.  అయితే ఇప్పుడీయ‌న‌కు పోటీగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో తన స్వంత డిస్ట్రిబ్యూషన్ కి రంగం సిద్దం చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక సీరియ‌స్ గా ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. మైత్రీ మూవీస్ మ‌రో రెండు సంస్థ‌ల‌తో క‌లిసి నైజాం మార్కెట్ పై క‌న్నేసింద‌ని తెలుస్తోంది.

ఇందులో సీడెడ్ కి చెందిన  ప్ర‌ముఖ డిస్ర్టిబ్యూట‌ర్ భాగ‌స్వామిగా ఉన్న‌ట్లు లీకులంద‌తున్నాయి.  ఈ ముగ్గురు ఏక‌మై రాజుగారిపై బిజినెన్ వ్యూహం ప‌న్నుతున్న‌ట్లు స‌మాచారం. మార్కెట్ నిపుణులు రంగంలోకి దించి నైజాంలో ప‌ట్టు సాధించాలంటే? ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి? కంటెంట్ ప‌రంగా తీసుకోవాల్సిన జాగ‌ర‌త్తుల ఏంటి? వంటి విష‌యాల‌పై సీరియ‌స్ గా డిస్క‌ష‌న్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దీనిలో భాగంగా సంక్రాంతి నుంచి బ‌రిలోకి దిగిపోవాల‌ని పావులు క‌దుతుపుతున్నట్లు తెలిసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న 'వాల్తేరు వీరయ్య'.. 'వీరసింహా రెడ్డి' సినిమాల పంపిణీ తో ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారుట‌. ఈ  నేపథ్యంలో నైజాం పంపిణీ రంగంలో హడావుడి మొదలైందంట‌న్నారు.

నైజాం ఏరియాలో థియేట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న సునీల్ నారంగ్..దిల్ రాజు సోద‌రుడు శిరీష్ రెడ్డి త‌గిన జాగ్ర‌త్త‌లకు రెడీ అవుతున్నారుట‌.  సునీల్ ని లాక్ చేసుకోగ‌ల్గితే మైత్రీ ప్లాన్ వ‌ర్కౌట్ అవ్వ‌ద‌ని రాజుగారు ప్లాన్ గా అమ‌లు చే స్తున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతి రిలీజ్ లు అన్ని పెద్ద సినిమాలే ఉంటాయి కాబ‌ట్టి కొత్త వాళ్ల‌కిచ్చి రిస్క్ తీసుకోవ‌డం క‌న్నా పాత వాళ్ల‌నే న‌మ్ముకుని  సెంటిమెంట్ గా ముందుకెళ్ల‌డ‌మే ఉత్తమం అన్న సంకేతాలు పాస్ చేసిన‌ట్లు వినిపిస్తుంది.  మ‌రి వీట‌న్నింటి దాటు కుని మైత్రీ మూవీస్ ఎలా నిల‌బ‌డుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News