'అరవింద సమేత వీర రాఘవ' సినిమా సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో బిగ్ స్క్రీన్ మీద సందడి చేశారు. ఎస్ఎస్ రాజమౌళి కోసం అంత టైమ్ కేటాయించినందుకు తారక్ కు తగిన ప్రతిఫలం లభించింది. ఈ ఉత్సాహంతో ఈసారి ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోవాలని నందమూరి హీరో ప్లాన్ చేసుకున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లోనే 'ఆచార్య' సినిమా విడుదలైన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావాలని భావించారు. దీని కోసం తారక్ చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే దానిపై స్పష్టత రావడం లేదు.
నిజానికి RRR తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ సినిమా చేయాల్సింది. కానీ ఏవో తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ స్థానంలోకి కొరటాల వచ్చి చేరాడు. అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన సినిమా లేట్ అయ్యే సూచనలు కనిపించడంతో దర్శకుడుని ఒప్పించి ఎన్టీఆర్ వైపు షిఫ్ట్ చేశారు. ఇటీవల యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కావడం లేదు.
'ఆచార్య' సినిమా డిజాస్టర్ గా మారడం కొరటాల పై గట్టి ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నష్ట పరిహారం చెల్లించే బాధ్యత అతనిపై పడటంతో.. తారక్ స్క్రిప్టు మీద ఫుల్ ఫోకస్ పెట్టలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అందుకే బౌండెడ్ స్క్రిప్ట్ అనుకున్న సమయానికి రెడీ అవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
హిట్టు ప్లాప్ లను పట్టించుకోకుండా అభిమానులకు ఏడాదికో సినిమా అందించే ఎన్టీఆర్.. గత నాలుగేళ్లలో ఒక్క మూవీ మాత్రమే చేశారు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడం.. కొరటాల సినిమా లేట్ అవుతుండంతో.. ఈసారి ఎక్కువ రోజులు ఆగాలని అనుకోవడం లేదట. అందుకే కొరటాలని నొప్పించకుండానే.. మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.
ఇప్పటికే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసాడు. కానీ నీల్ ప్రస్తుతం 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టైగర్ ముందున్న ఏకైక ఆప్షన్ బుచ్చిబాబు సానా.
'ఉప్పెన' సక్సెస్ తర్వాత బుచ్చిబాబు.. ఎన్టీఆర్ కు ఓ లైన్ చెప్పి ఒప్పించాడు. ఇప్పటికే స్క్రిప్టు కూడా రెడీ చేసి పెట్టుకొని ఉన్నాడు. అది కూడా పాన్ ఇండియా కథే. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు సినిమాని ముందుకు తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ విషయంలో కొరటాల ఏమాత్రం హర్ట్ అవ్వకుండా డీల్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే బుచ్చిబాబు తర్వాత 'జనతా గ్యారేజ్' దర్శకుడి సినిమా ఉంటుంది.
మరోవైపు ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాలతోనే అనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ కథ హీరోకి ఎంతో నచ్చిందని.. RRR తర్వాత పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి ఇదే సరైన స్క్రిప్టు అని భావిస్తున్నారని అంటున్నారు. దర్శకుడితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా బౌండెడ్ స్క్రిప్టు సిద్ధం చేయడానికి తగినంత సమయం ఇచ్చాడని.. సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తారక్ లైనప్ లో మార్పులు ఉంటాయా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.