30లకే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్న సింగర్

Update: 2016-11-30 13:30 GMT
పెద్దగా పరిచయం అక్కర్లేని బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్. హిందీలోనే కాదు.. దేశంలోని పలు భాషల్లో పాటలు ఆలపించాడు. 2010లోనే కెరీర్ ఆరంభించినా.. అనతి కాలంలోనే తన గొంతు వినిపించని బాలీవుడ్ సినిమా ఏదీ ఉండని స్థాయికి చేరుకున్నాడు. ప్రతీ దర్శకుడు నిర్మాత.. అరిజీత్ తో కనీసం ఒక్క పాటైనా పాడించుకోవాలని అనుకుంటారంటే.. ఇతని ట్యాలెంట్ అర్ధమవుతుంది.

కేవలం ఏడేళ్ల కెరీర్ ని కంప్లీట్ చేసుకున్న అరిజీత్ సింగ్.. మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 'ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. ప్రతీ ఆరేడేళ్లకు బాలీవుడ్ లో మార్పు తప్పనిసరి. కొత్త గొంతులు పలకరిస్తూ ఉంటాయ్. పేరు తెచ్చుకుంటూ ఉంటాయ్. నేను కూడా అంతే. మరో ఏడాదిలో నేను రిటైర్ కావాలని అనుకుంటున్నా' అని చెప్పాడు అరిజీత్ సింగ్. ప్రస్తుతం ఇతని వయసు 29 కాగా.. 30 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యకరం.

ఈ సింగర్ తెలుగు సినిమాలకు కూడా పాటలు పాడాడు. 2010లో నాగార్జున కేడీతో టాలీవుడ్ కెరీర్ ప్రారంభించి.. 2013లో స్వామిరారా.. ఉయ్యాలా జంపాలా.. నువ్వే నా బంగారం.. 2014లో మనం.. నీ జతగా నేనుండాలి.. రౌడీ ఫెలో.. 2015లో దోచెయ్.. భలేమంచిరోజు.. తనునేను చిత్రాలకు తన స్వరాన్ని అందించాడు అరిజీత్ సింగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News