సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీని ఇటీవల ప్రకటించడం.. అది పట్టాలెక్కకుండానే మధ్యలో ఆగిపోవడం తెలిసిందే. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల్లో అర్జున్ కు, హీరో విశ్వక్ సేన్ కు మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు కారణంగా ఈ మూవీని అర్జున్ నిలిపి వేస్తున్నానని ప్రకటించడమే కాకుండా మీడియా ముఖంగా విశ్వక్ సేన్ ఓ కమిట్ మెంట్ లేని నటుడు అంటూ ముద్ర వేయడం తెలిసిందే.
తనకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ పాటలు నచ్చడం లేదని, ఇలాంటి కమిట్ మెంట్ లేని నటుడిని తాను ఎక్కడా చూడలేదని, అలా కమిట్ మెంట్ లేనప్పుడు ఇండస్ట్రీ లో పద్దతులు తెలియనప్పుడు సినిమాలు చేయకండి' అంటూ అర్జున్ ఘాటుగా స్పందిచిన విషయం తెలిసిందే. దీనిపై విశ్వక్ సేన్ కూడా ఇదే స్థాయిలో స్పందించాడు. సంభాషణలు, పాటలు, మ్యూజిక్ విషయంలో నేను అన్నమాట నిజమే అన్నారు.
అయితే ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని, తాను చెప్పినట్టే నడుచుకోవాలని అంటున్నారన్నాడు. అంతే కాకుండా సెట్ లో తన మాటకు అస్సలు గౌరవం వుండదని, పది మార్పుల్లో రెండు చేసినా సర్దుకుపోయేవాడినని కానీ అలా జరగలేదని, కళ్లు మూసుకుని కాపురం చేయమంటే ఎలా అని అందుకే మనకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చేశానని విశ్వక్ సేన్ తెలిపాడు. ఇక సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ చెక్ లు,డాక్యుమెంట్ లు నిర్మాతల మండలికి పంపినట్టు తెలియజుశాడు.
ఈ వివాదం విశ్వక్ సేన్ కు మైనస్ గా మారే ప్రమాదం వుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా హీరోగానూ సినిమాలు చేశాడు, చేస్తున్నాడు కూడా. రీసెంట్ గా 'ఓరి దేవుడా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం 'గామి', దాస్ కీ ధమ్కీ' సినిమాల్లో నటిస్తున్నాడు. 'గామి' మరో దర్శకుడితో చేస్తుండగా 'దాస్ కీ ధమ్కీ' మాత్రం స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు.
విశ్వక్ సేన్ డైరెక్టర్ కూడా కావడంతో భవిష్యత్తులో చేయనున్న సినిమాల్లో తన ఇన్ వాల్వ్ మెంట్ ఖచ్చితంగా వుంటుందని అర్జున్ తో జరిగిన వివాదం స్పష్టం చేసింది. ఆ కారణంగా విశ్వక్ సేన్ తో సినిబమాలు చేయాలనుకునే వారు ఈ విషయంపై వెనక్కి తగ్గే అవకాశం వుంది. దాంతో విశ్వక్ మంచి ప్రాజెక్ట్ లని మిస్సయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్లస్ పాయింట్ ఉంటంటే ప్రొడ్యూసర్స్ మాత్రం విశ్వక్ ని బలంగా నమ్మే అవకాశం వుంది.
ఎందుకంటే తను సినిమా చేస్తున్నాడంటే ప్రతీ విషయంలోపూ పూర్తి పర్ ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తాడని క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా ప్రమోషన్స్ ని కూడా కొత్తగా ప్లాన్ చేస్తాడనే ముద్ర పడిపోయింది. ఇది విశ్వక్ కు ప్లస్ గా మారబోతోంది. దర్శకుల విషయంలో అర్జున్ ఎపిసోడ్ విశ్వక్ కు మైనస్ గా మారితే నిర్మాతలు అతనికి ప్లస్ గా మారే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.